Begin typing your search above and press return to search.

ఎంత కేటీఆర్ బర్త్ డే అయితే ఇలా చేస్తారా?

By:  Tupaki Desk   |   25 July 2022 10:05 AM GMT
ఎంత కేటీఆర్ బర్త్ డే అయితే ఇలా చేస్తారా?
X
మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. అయితే కేటీఆర్ పై అభిమానంతో కొందరు అభిమానులు చేసిన అతికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజల బాధలు చూడకుండా హైదరాబాద్ లో కొందరు అభిమానులు ట్రాఫిక్ జాం చేసిన తీరుపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ టీఆర్ఎస్ నేత దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కార్లను నిలిపి సెలబ్రేషన్స్ నిర్వహించారు. దీనిని డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించి వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ట్రాఫిక్ ను నిలిపివేసి మరీ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ఎలా అనుమతించారని మండిపడుతున్నారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూలై 24ను తెలంగాణ అంతటా సందడి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ ను టీఆర్ఎస్ అభిమానులు విడుదల చేశారు.

ఇక ప్రతీ బర్త్ డేకు కేటీఆర్ ఏదో ఒక సామాజక సేవ చేస్తారు. పోయిన బర్త్ డేకు తనే సొంతంగా 6 అంబులెన్స్ లను కొని ఆస్పత్రులకు విరాళం ఇచ్చారు.

టీఆర్ఎస్ కార్యకర్తలు తన బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్లు, టీవీల్లో ప్రచార యాడ్స్ ఇవ్వకుండా ఆ డబ్బులతో పేదలకు సేవ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు.. దానికి మంత్రి మల్లారెడ్డి సహా చాలా మంది పాటించి ఆస్పత్రులకు అంబులెన్స్ లు విరాళమిచ్చారు.

ఇక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాలుకు గాయమైంది. ఫ్యాక్చర్ కావడంతో ఆయన కాలుకు పట్టి కట్టుకొని కనిపించారు. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని కేటీఆర్ తెలిపారు. దీంతో బర్త్ డే నాడు కేటీఆర్ ఇంటికే పరిమితమయ్యారు.