Begin typing your search above and press return to search.

ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 Jan 2023 4:01 PM GMT
ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X
అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది నెలలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు పచ్చ జెండా ఊపారు. అలాగే వారికి హెల్త్ కార్డులు కూడా జారీ చేయడానికి సన్నద్దం చేస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు భారీగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా భారీగా ఐపీఎస్ లు మారడంతో ఇక ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. 2018 డిసెంబర్ లో ఏర్పడిన ప్రభుత్వం నిర్ణీత సమయానికి కాకుండా మరింత ముందుకు వెళ్లొచ్చని ప్రచారం సాగుతోంది.

తెలంగాణలో కేసీఆర్ అడుగులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారని ఈ మేలోనే ముహూర్తం నిర్ణయించినట్టుగా ప్రచారం సాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ వేసవిలో జరిగే ఎన్నికలతోనే కేసీఆర్ వెళతాడన్న ప్రచారం సాగుతోంది. ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

పార్లమెంట్ ను రద్దు చేసి బీజేపీ వస్తే.. మేం కూడా ముందస్తుకు సిద్ధం అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధమేనని అన్నారు.

తెలంగాణపై కేంద్రం కక్ష గట్టిందని.. మనం రూపాయి ఇస్తే.. కేంద్రం 46 పైసలే ఇస్తోందని ఆయన మండి పడ్డారు. నేను చెప్పిన లెక్క తప్పయితే రాజీనామాకు సిద్ధం అని ప్రకటించారు.

నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఏం తెచ్చారు? జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి జూట్ బోర్డు కూడా ఎత్తేశారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థనైనా ఇచ్చారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

దీన్ని బట్టి ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగవని నిర్ధారణ అయిపోయింది. ముందస్తు ఉండదని.. ఈ డిసెంబర్ లో రెగ్యులర్ గానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని కేటీఆర్ మాటలను బట్టి తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.