Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీకి కేటీఆర్ లేఖ.. ఏమన్నారంటే..
By: Tupaki Desk | 6 April 2022 11:00 PM ISTదేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న చమురు ధరల అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అసమర్థ విధానాల వల్ల ధరలు పెంచుతూ.. ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ముడిచమురు ధరలు పెంచడమే కేంద్రం పనిగా పెట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అసమర్థ విధానాలే ప్రస్తుత దుస్థితికి కారణమని మంత్రి దుయ్యబట్టారు.
పన్నులు పెంచడమే పరిపాలనగా కేంద్రం భ్రమిస్తోందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలపై రూ.26.51 లక్షల కోట్ల పెట్రో పన్ను భారం పడుతోందని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్ను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఒకవైపు కేంద్రం భారీగా పెట్రో ధరలు పెంచుతూ.. రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వితండ వాదన చేస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ లక్ష్యంగా పెట్టుకునే పీఎం పెట్రో పన్ను యోజన పథకం తెచ్చారన్నారు. పెట్రో ధరల నియంత్రణలో విఫలమైనందుకు ప్రజలను ప్రధాని మోడీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే ప్రజలు తిరస్కరించడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అని చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని ఆయన ఆ లేఖలో విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలతో సంబంధంలేకుండా దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్నును కేంద్రం దోచుకుందని ఆయన పేర్కొన్నారు. అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు.