Begin typing your search above and press return to search.
అస్సలు తగ్గని కేటీఆర్.. కేంద్ర మంత్రికి మామూలు పంచ్ వేయలేదుగా?
By: Tupaki Desk | 26 Dec 2021 12:04 PM ISTఒకసారి టార్గెట్ చేస్తే.. దాని సంగతి చూసే వరకు తగ్గకుండా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. అందునా రాజకీయనాయకులకు ఉండే సవాలచ్చ వ్యవహారాల్లో తాము టార్గెట్ చేసిన అంశాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ.. టైమ్లీగా రియాక్టు కావటం అంత సులువు కాదు. ఇలాంటి విషయాల్లో మంత్రి కేటీఆర్ తీరు చాలామందికి కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఒకసారి మంత్రి కేటీఆర్ ఏదైనా విషయం మీద ఫోకస్ పెడితే.. ఆయన రాడార్ లో నుంచి ఇక తప్పించుకునే అవకాశమే లేదని చెబుతారు.
తాజాగా ఆ వాదనను నిజం చేసేలా పరిణామాలు ఉన్నాయి. మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రధాని ప్రకటించటం తెలిసిందే. జాతి జనులకు క్షమాపణలు చెప్పి మరీ ఆయన తాము తెచ్చిన మూడు చట్టాల్ని వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాత్రం అందుకు భిన్నంగా యూ టర్న్ తీసుకోవటం సంచలనంగా మారింది.
తాము వెనక్కి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సవరణలతో ఎలా అయినా తెచ్చి తీరతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి తోమర్ తీరుపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ట్వీట్ తో విరుచుకుపడ్డారు. ‘గౌరవనీయులైన ప్రధాని క్షమాపణలు.. సాగు చట్టాల రద్దు.. కేవలం ఎన్నికల స్టంటే అనుకోవాల్సిందేనా? ప్రధాని నరేంద్రమోడీ గారేమో చట్టాల్ని రద్దు చేశామని చెబుతున్నారు. వ్యవసాయ మంత్రి నరేంద్రగారేమో (ఇద్దరి పేర్ల ముందు నరేంద్ర కామన్ కావటంతో ఆ విషయాన్ని సెటైరికల్ గా పేర్కొంటూ) ప్రతిపాదన వ్యాఖ్యలు చేస్తున్నారు. క్లాసిక్. బీజేపీ రాజకీయాలు.. ఈ ప్రభుత్వం విషయంలో దేశంలోని రైతులంతా అప్రమత్తంగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి నోటి నుంచి ప్రకటన వచ్చిన కాసేపటికే.. ఏ మాత్రం వేలు పెట్టే అవకాశం ఇవ్వకుండా.. ఫుల్ మీల్స్ తరహాలో భారీ పంచ్ వేయటంతో ద్వారా కేంద్రమంత్రితో పాటు.. మోడీ సర్కారును ఇరుకున పడేసేలా మంత్రి కేటీఆర్ ట్వీట్ ఉందని చెప్పాలి.తాజా ట్వీట్ తో కేంద్రం తీసుకునే నిర్ణయం విషయంలో తగ్గేదెలే అన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.