Begin typing your search above and press return to search.

ఒక్క ఫోన్ కాల్ తో అడ్డంగా బుక్కైన మంత్రి కేటీఆర్

By:  Tupaki Desk   |   19 Oct 2022 10:30 AM GMT
ఒక్క ఫోన్ కాల్ తో అడ్డంగా బుక్కైన మంత్రి కేటీఆర్
X
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. స్వయంగా కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ అయిన కేటీఆర్ సైతం శాయశక్తులు ఒడ్డుతున్నారు. ఎంతలా అంటే బీజేపీలో ఉన్న కీలకనేతలకు స్వయంగా ఫోన్లు చేసి మరీ తమకు సపోర్టు చేయాలనేంతగా.. తాజాగా మునుగోడులో ఓ బీజేపీనేతకు కేటీఆర్ చేసిన ఫోన్ కాల్ వీడియో లీక్ అయ్యింది. గెలుపు కోసం కేటీఆర్ బతిమిలాడుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. మునుగోడు గెలుపు కోసం టీఆర్ఎస్ ఎంతకైనా ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతోంది.

టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారుతున్న వేళ ఇంట గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. అందుకే ఎప్పుడూ లేనిది తన ఇద్దరు ఆయువుపట్టులైన కేటీఆర్, హరీష్ లను మునుగోడులో దించేశారు. కేసీఆర్ యే స్వయంగా ఎన్నికల వ్యూహాలు రెడీ చేసి అమలు చేస్తున్నారు.

ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో మునుగోడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేతతో ఫోన్ లో సంభాషించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ బీజేపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

కేటీఆర్ సదురు బీజేపీ నేతకు ఫోన్ చేసి మాట్లాడుతూ.. 'రాజగోపాల్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు.. ఆయన నిజమైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు.. ఈ ఎన్నికల్లో మాకు సహకరించండి.. మునుగోడులో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో బీజేపీ అదికారంలోకి రాదు.. పోయేది ఏం లేదు.పనిచేశాకే ఓట్లు అడుగుతున్నాం.. కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం.. మునుగోడులో మీరు బలమైన నేత అని తెలుసుకొని ఫోన్ చేశా' అంటూ కేటీఆర్ ఫోన్ లో సంభాషించారు.

అయితే రైతు బంధ స్కీం బాగాలేదని.. కౌలురైతులకు ఇవ్వకుండా బడా రైతులకు ఇవ్వడం సరికాదని సదురు బీజేపీ నేత కౌంటర్ ఇచ్చాడు. పించన్లు, భరగీథ పథకం బాగుందని అన్నారు. ఇదంతా పక్కనున్న వారు దాన్ని వీడియో తీసి బీజేపీ నేతలకు ఇవ్వడంతో అది వైరల్ అయ్యింది.

ఇక అలాంటిదేం లేదని.. చేనేత నాయకుడితో కేటీఆర్ మాట్లాడారని.. అందులో తప్పేం లేదని టీఆర్ఎస్ బుకాయిస్తోంది. అయితే మంత్రి కేటీఆరే స్వయంగా బీజేపీ నేతకు ఫోన్ చేసి మాట్లాడడం.. తమకు సహకరించాలంటూ కోరడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.