Begin typing your search above and press return to search.

తెలంగాణ గవర్నర్ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 April 2022 3:33 PM GMT
తెలంగాణ గవర్నర్ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
X
తెలంగాణ గవర్నర్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శల వాడిని మరింత ఎక్కుపెట్టింది. ఒక్కొక్క మంత్రిని బయటకు రప్పించి మరీ విమర్శలు చేస్తున్నట్టుగా పరిణామాలను బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరువైపుల నుంచి మాటల యుద్ధం ఆగడం లేదు. ఢిల్లీ వేదికగా తమిళిసై చేసిన విమర్శలకు ఇప్పుడు తెలంగాణ మంత్రులు బరెస్ట్ అవుతున్నారు. అంతే తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు సీఎస్ పై గవర్నర్ చేసిన కామెంట్లపై టీఆర్ఎస్ సర్కార్ ఎదురుదాడికి దిగింది. ఇప్పటికే గవర్నర్ వ్యాఖ్యలపై కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్రమంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ తో పంచాయితీ లేదని.. ఆమె అంతా ఊహించుకుంటోందని అన్నారు. తాజాగా మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గవర్నర్ పై ఫైర్ అయ్యారు.

గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హితవు పలికారు. తమిళిసై వక్రబుద్దితో వ్యవహరిస్తున్నారన్న ఘాటు విమర్శ చేశారు. ప్రభుత్వం ఎక్కడ వమానపరిచిందో గవర్నర్ తెలుపాలని మంత్రి నిలదీశారు.

గవర్నర్ తన పరిధిలో ఉంటే అందరూ గౌరవిస్తారన్నారు. ఉగాది నాడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గవర్నర్ యాదాద్రికి వెళ్లారన్నారు. కేవలం 20 నిమిషాలు ముందు చెబితే ప్రొటోకాల్ పాటించడం కష్టమవుతుందన్నారు. ఈ విషయాన్ని గవర్నర్ గుర్తించకపోవడం శోచనీయమన్నారు. గవర్నర్ హోదాలో రాజ్యాంగబద్దంగా తమిళిసై వ్యవహరిస్తే బాగుటుందని హితవు పలికారు.

గత గవర్నర్ నరసింహన్ కు తాము పూర్తిగా సహకరించారని.. రాష్ట్రాభివృద్ధిలో నరసింహన్ భాగస్వామ్యులయ్యారన్నారు. నరసింహన్ తో పోల్చడం ద్వారా తమిళిసై అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్పినట్టైంది.