Begin typing your search above and press return to search.

ఆ డాక్టర్ చేసిన పనికి మంత్రి హరీశ్ షాక్.. చర్యలకు తక్షణ ఆదేశాలు

By:  Tupaki Desk   |   26 Jan 2022 5:35 AM GMT
ఆ డాక్టర్ చేసిన పనికి మంత్రి హరీశ్ షాక్.. చర్యలకు తక్షణ ఆదేశాలు
X
ఒకే రోజు ఒక బాధ.. మరో ఆనందం. రూపాయికి రెండు పార్శాలు ఉన్నట్లే.. చెడు మంచి కలయిక మాదిరి చోటు చేసుకున్న రెండు ఉదంతాలుపలువురిని ఆకర్షిస్తున్నాయి. ఒకే రోజులో తాను మంత్రిగా బాధ్యతల్నినిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఈ రెండు ఉదంతాలు పట్టలేనంత ఆగ్రహాన్ని.. అదేసమయంలో పట్టలేనంత సంతోషాన్ని మంత్రి హరీశ్ కు లభించాయి. తొలుత పట్టలేని ఆగ్రహం విషయానికి వస్తే..

ఒక వైద్యుడు వ్యవహరించిన తీరుకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుడి చేసిన నిర్వాకం తెలిసి షాక్ తిన్న ఆయన.. వెనువెంటనే చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ జరిగిందేమంటే.. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఒక మహిళ పురుటి నొప్పులతో ఆసుపత్రి కి వచ్చారు. ఆమె.. కరోనా పాజిటివ్ కావటంతో.. ఆమెకు డెలివరీ చేయటానికి సదరు వైద్యుడు నో అంటే నో చెప్పారు.

ఈ విషయం మంత్రి హరీశ్ ద్రష్టికి వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హరీశ్.. సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పురుటి నొప్పులతో వచ్చిన మహిళకు కొవిడ్ పాజిటివ్ ఉన్నప్పటికి వైద్యం చేయాల్సిందేనని.. కచ్ఛితంగా ప్రసవం చేయాలని ఆదేశించారు. ప్రసవం చేయటానికి నో చెప్పిన వైద్యుడి తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి హరీశ్.. ఆయనపై చర్యలు వెంటనే తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అరుదైన ఘనతను సాధించింది.

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా వంద శాతం రెండు డోసులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దక్షిణ భారత దేశంలోని మరే రాష్ట్రం సాధించలేని రికార్డును కరీంనగర్ సొంతం చేసుకుంది. సౌతిండియా మొత్తంలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రెండో జిల్లాగా.. తెలంగాణలో తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచింది. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి హరీశ్ రావుకు ఇంతకుమించిన సంతోషం కలిగించే వార్త ఇంకేం ఉంటుంది చెప్పండి.