Begin typing your search above and press return to search.

బాబుకి సవాల్ విసిరిన మంత్రి అవంతి .. !

By:  Tupaki Desk   |   28 Feb 2020 9:52 AM GMT
బాబుకి సవాల్ విసిరిన మంత్రి అవంతి .. !
X
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చి ధర్మాలు చేయించాల్సిన ఖర్మ మాకు పట్టలేదు అని తెలిపారు. పులివెందుల నుంచి రౌడీలను రప్పించి తమపై దాడి చేయించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేసారు.

శుక్రవారం మీడియా తో మాట్లాడిన మంత్రి అవంతి.. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని , చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని, పోలీసులపై చంద్రబాబు,లోకేష్‌ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. పోలీసులు చట్టానికి లోబడే పనిచేస్తారని తెలిపారు. ఇళ్లకి వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్‌ అనడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారని ,చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఆయనపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మండు టెండలో ఆరు గంటల పాటు ప్రజలు ధర్నా చేశారు. పోలీసులు, మహిళలపై చంద్రబాబు తీరు దారుణంగా ఉంది. లోకేష్‌ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బాబుకి ఒకసారి బుద్ది చెప్పినా కూడా , మళ్లీ మళ్లీ అదే దారిలోనే పోతున్నారు అని , ప్రజలు అన్ని విషయాలు బాగా గమనిస్తున్నారని అన్నారు.

మండలిలో మూడు రాజధానుల బిల్లుల ను టీడీపీ వ్యతిరేకించడంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేశంగా ఉన్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు అనుకున్నారని, కానీ ఇది ఉద్యమాలకు పుట్టినిల్లు అని, అలాగే విశాఖ పరిపాలన రాజధానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారో లేదో తేల్చి చెప్పాలని చెప్పారు. ఒకవేల విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతికే మద్దతు తెలిపితే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.