Begin typing your search above and press return to search.

గంటాను ఆటాడుకుంటున్న మంత్రి అవంతి

By:  Tupaki Desk   |   10 March 2020 5:33 AM GMT
గంటాను ఆటాడుకుంటున్న మంత్రి అవంతి
X
విశాఖపట్టణంలో సరికొత్త రాజకీయం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రాజకీయం మొదలైంది. ప్రస్తుతం కీలకమైన రాజధాని విశాఖపట్టణం ఎంపికవడంతో వైఎస్సార్సీపీ ప్రాబల్యం పెంచుకుంటోంది. ఈ క్రమంలో విశాఖపట్టణంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగ్రా మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆయన పేరు కనీసం నియోజకవర్గంలో వినిపించేలా చేయడం లేదు. మొత్తం తన అనుచరుడితో వ్యవహారం నడిపిస్తున్నాడు. దీంతో మాజీమంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు చుక్కలు చూపిస్తున్నారు.

మొదట్లో అవంతి, గంటా టీడీపీలో కీలక నాయకులుగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో వీరిద్దరికీ బెడిసికొట్టింది. భీమిలి స్థానానికి గంటా, అవంతి చంద్రబాబు వద్ద పంచాయతీకి వెళ్లారు. అయితే వీరిద్దరికీ చంద్రబాబు ఎటు తేల్చలేదు. దీంతో వెంటనే అవంతి వైఎస్సార్సీపీలో చేరిపోయి భీమిలి టికెట్ సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు మంత్రి కూడా. అయితే ఇటు గంటాకు కూడా భీమిలి స్థానం దక్కకపోవడంతో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గంటాను ఓడిచేందుకు అప్పట్లో వైఎస్సార్సీపీ విశ్వ ప్రయత్నాలు చేయగా అయినా గంటా గెలిచాడు.

అయితే కేకే రాజు ఓడడం, గంటా గెలవడం అవంతికి మొదటి నుంచి నచ్చలేదు. దీన్ని జీర్ణంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు అధికారం తమది రావడంతో అవంతి గంటాపై కసి తీర్చుకుంటున్నారు. అధికారంలో లేకపోవడంతో గంటా ఎమ్మెల్యేగా ఉన్నా చురుగ్గా ఉండడం లేదు. నియోజకవర్గంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని అవంతి కేకే రాజుతో వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇప్పుడు నియోజకవర్గంలో కేకే రాజు ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కేకే రాజుతో అవంతి రిబ్బన్ కట్ చేయిస్తున్నాడు.

నియోజకవర్గంలో కేకే రాజు బలం పెంచుకునేలా ఒక వ్యూహంతో అవంతి ప్రయత్నాలు చేస్తున్నారు. గంటా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న కేకే రాజుతో మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలను నడిపిస్తున్నాడు. ఎమ్మెల్యే గంటా ఉన్నప్పటికీ కేకే రాజు ఎమ్మెల్యే మాదిరి వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను కేకే రాజుతో తనిఖీలు చేయించడం, ప్రభుత్వ పథకాలు ఏది ప్రారంభమైనా సరే నియోజకవర్గంలో కేకే రాజుతోనే చేయించడం మంత్రి ఆదేశాలతోనే జరుగుతున్నాయి. అధికారులు ప్రొటోకాల్ కోసం ఎమ్మెల్యే గంటాకు ఆహ్వానం అందిస్తున్నా మిగిలిన తంతు అంతా మంత్రి అవంతి చెప్పిన ప్రకారం నడిపిస్తున్నారని అక్కడి స్థానికుల్లో వినిపిస్తున్న మాట. తన నియోజకవర్గం భీమిలి కాకుండా మంత్రి అవంతి ఫోకస్ అంతా విశాఖ ఉత్తర నియోజకవర్గంపైనే ఉందని తెలుస్తోంది.