Begin typing your search above and press return to search.
క్రీస్తుకి.. కృష్ణుడుకి తేడా లేదు.. కొత్త నిర్వచనం చెప్పిన ఏపీ మంత్రి
By: Tupaki Desk | 28 Dec 2022 7:00 AM ISTతరచుగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో నిలిచే ఏపీ మంత్రి, వృత్తి రీత్యా డాక్టర్ సీదిరి అప్పలరాజు.. సరికొత్త వ్యాఖ్యలతో మరోసారి మీడియా దృష్టినే కాకుండా.. రాష్ట్ర ప్రజల దృష్టిని కూడా ఆకర్షించారు. ఈ సారి ఆయనకు క్రీస్తులో శ్రీకృష్ణుడు కనిపించాడు! ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమే. తాజాగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీదిరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీస్తుకు-కృష్ణుడికి మధ్య వ్యత్యాసం లేదని.. అయితే.. సంబంధిత స్వాములు, ప్రార్థనా పరులు దీనిపై కొంత దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.
మంత్రి సొంత నియోజకవర్గం శ్రీకాకుళంలోని పలాసలో డిసెంబరు 25న క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ``మానవత్వం అనేది అంతటా(అది ఏమతమైనా అనేకోణంలో) ఒక్కటేనని నమ్ముతాను. ఏసును దేవుని దూత అని పిలుస్తారు. అలానే ఆయన ప్రసిద్ధి చెందారు. జీసస్ క్రైస్ట్ అనేది ఇంగ్లీషు పదం. తెలుగులో దానికి సాపేక్ష పదం `క్రిష్``` అని వ్యాఖ్యానించారు.
క్రీస్తు, కృష్ణుడు రెండు పదాలను ఉచ్ఛరిస్తూ, రెండింటిలోనూ సారూప్యత ఉందని చెప్పారు. “అవి ఒకే పదం నుండి ఉద్భవించాయా లేదా వేరే పదాల నుండి వచ్చాయా? దేవుళ్లను ఇప్పుడు వివిధ మతాలు, విశ్వాసాల ప్రజలు పూజించవచ్చు కానీ పురాతన కాలంలో, వారి మధ్య కొంత సంబంధం ఉండవచ్చు. ఈ ప్రాంతంలో పరిశోధన చేసి, ఈ పదాల మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని నేను బిషప్‌ని అభ్యర్థిస్తున్నాను ” అని ఆయన వ్యాఖ్యానించారు.
హిందువుల మత పెద్దల ముందు కూడా తాను ఇదే అంశాన్ని లేవనెత్తానని, పదాల మూలానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా లింక్ ఉందా అని కనుగొనాలని కోరతానని మంత్రి చెప్పారు. ఈ విషయం తన మనసులో ఎప్పటి నుంచో కదలాడుతోందని మంత్రి సీదిరి చెప్పారు.
ఈ నేపథ్యంలో మత పెద్దలను ఈ విషయంలో అసలు మర్మం కనిపెట్టాలని కోరుతున్నానని చెప్పారు. మొత్తానికి ఇప్పటి వరకు ఎవరికీ రాని ఆలోచనలు సీదిరికి రావడం పట్ల ఆయా మతాల వారు ఆశ్చర్యం.. విస్మయం.. ఇంకా ఏదుంటే అది వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.