Begin typing your search above and press return to search.
గండి పూడ్చకుంటే.. చెరువులోకి దూకుతా.. ఏపీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 20 Dec 2021 12:04 PM ISTఏపీలో ఏమవుతోంది? ఇప్పటికే అధికారపక్షం మీద తీవ్రమైన విమర్శలు.. భారీ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. విపక్షాలు ఎవరికి వారుగా వ్యవహరిస్తూ.. ఏపీ అధికారపక్షంపై విరుచుకుపడుతున్న వేళ.. ఆ పార్టీ నేతలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటివేళ.. అధికార పార్టీ నేతల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తున్నాయి.
అధికారపక్ష నేతలు చెప్పిన పనులు కూడా కాకపోతే ఎలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేయటమే కాదు.. ఏపీ అధికారుల తీరును పలువురు తప్ప పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువు.. చిన్న కండలేరు చెరువుకు గండి పడింది. దాన్ని పూడ్చాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా.. ఆ పనేమీ జరగట్లేదు.
ఈ నేపథ్యంలో తానే రంగంలోకి దిగారు మంత్రి సురేశ్. చెరువునకు పడిన గండిని పరిశీలించిన ఆయన.. దాన్ని పూర్తిస్థాయిలో పూడ్చకపోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. చెరువునకు పడిన గండిని వెంటనే పూడ్చాలని ఆదేశించారు. ఒవకేళ.. దాన్ని పూడ్చకుంటే.. తానే చెరువులోకి దూకుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరమ్మత్తులు చేయని అధికారు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాను చెప్పిన సమయానికి చెరువు గండి పూడ్చకుంటే.. తానే చెరువులోకి దిగి మరమ్మత్తులు చేస్తానన్న ఆయన మాటలు అధికారుల్లో ఎంతమేర చురుకు తెప్పిస్తుందో చూడాలి. మరి.. మంత్రివారి డెడ్ లైన్ కు అధికారులు ఎంతమేర రియాక్టు అవుతారో చూడాలి.