Begin typing your search above and press return to search.
మిగిలిన పార్టీలకు భిన్నం.. మజ్లిస్ ‘‘దర్బార్’’
By: Tupaki Desk | 18 Dec 2015 5:00 AM GMTహైదరాబాద్ గురించి పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి పాతబస్తీ మజ్లిస్ కు ఎంత కంచుకోటో అందరికి తెలిసిందే. రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. పాతబస్తీలో పాగా వేసే విషయంలో మాత్రం విఫలమవుతుంటాయి. కొరకరాని కొయ్యలా ఉండే పాతబస్తీని చాలామంది అధినేతలు వదిలేసేవారు. దాని మీద ఫోకస్ చేసే కన్నా.. మజ్లిస్ తో స్నేహ హస్తాన్ని జాపి.. మిత్రపక్షంగా చేసుకోవటం ద్వారా పాతబస్తీ తమదేనన్న ఆత్మసంతృప్తి పొందిన నేతలు కనిపిస్తారు. ఇలాంటి వైఖరికి తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మొదలు.. ఆరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు కనిపిస్తారు. ఇంతకీ పాతబస్తీలో మజ్లిస్ అంతలా పాగా వేయగలుగుతుంది? దాని వెనుకున్న సీక్రెట్ ఏమిటి? అన్న ప్రశ్నలు వేసుకుంటే.. ఆసక్తికర సమాధానాలే లభిస్తాయి
మజ్లిస్ పార్టీకి కంచుకోటలా ఉండే పాతబస్తీ ప్రస్తావన తీసుకొచ్చిన వెంటనే.. అందరి నోటి నుంచి వచ్చే మాట.. మతం ప్రాతిపదికన ఓట్లు అక్కడ చీలుస్తారు. ముస్లింలు అధికంగా ఉండే పాతబస్తీలో మజ్లిస్ కు అక్కడి వారు పట్టం కడతారంటూ సింఫుల్ గా ఒక విశ్లేషణ చేసేసి వదిలేస్తారు. కానీ.. లోతుల్లోకి వెళ్లి చూసినప్పుడు దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. మజ్లిస్ నేతల కమిట్ మెంట్.. ఎన్నికల విషయంలో ఆ పార్టీ నేతల పక్కా వ్యూహమే వారిని ఇంతకాలం తిరుగులేని రాజకీయ శక్తిగా నిలిపిందని అర్థమవుతుంది.మజ్లిస్ కు పోటీగా ఎంబీటీ ఉన్నప్పటికీ.. అదెలాంటి ప్రభావాన్ని చూపించలేదు. మజ్లిస్ కు పోటీగా బరిలోకి దిగినా ఎన్నికల్లో అది చూపించే ప్రభావం అంతంతమాత్రమే.
మిగిలిన పార్టీల్లో కనిపించని ఒక విచిత్రమైన విధానం మజ్లిస్ లో కనిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన అధినేత మొదలుకొని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. కార్పొరేటర్లు సహా అంతా పార్టీ కార్యాలయమైన దారుస్సలాంలో ప్రతి రోజూఉంటారు. ప్రజల కష్టాలు.. వారి అవసరాలు.. వారి విన్నపాలు ఓపిగ్గా వింటుంటారు. వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటారు. వారంలో సెలవు రోజైన ఆదివారం సైతం ఈ దర్బారు నడుస్తుంది. ఒక్క శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రం ఈ దర్బారుకు విశ్రాంతి ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పార్టీ ప్రధాన కార్యాలయంలో.. సాయంత్రం పూట పార్టీకి చెందిన నియోజకవర్గ కార్యాలయాల్లో నేతలు దర్శనమిస్తారు. నిత్యం సాగే ఈ దర్బారు మజ్లిస్ కు విపరీతమైన బలాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.
అధినేత మొదలుకొని.. పార్టీ కార్పొరేటర్ ఒకేచోట కొలువు తీరటం.. తమ సమస్యలు చెప్పుకోవటానికి వచ్చే ప్రజలకు సంబంధించిన విషయాల్ని ఓపిగ్గా వింటుంటారు. నిత్యం 300 నుంచి 500 మంది మధ్య ప్రజలు వచ్చి పోతుంటారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఈ రాకపోకలు మరింత పెరుగుతుంటాయి. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల్లో అత్యధిక భాగం రేషన్ కార్డు.. నల్లా కనెక్షన్.. డ్రైనేజీ.. సీసీ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసమే వస్తుంటారు. మరికొందరు తమ వ్యక్తిగత సమస్యల గురించి వస్తుంటారు. ఇలా నిత్యం నిర్వహించే దర్బారుకు ముస్లింలతో పాటు.. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు రావటం కనిపిస్తుంటుంది. ఇలాంటి వైఖరే.. మజ్లిస్ ను పాతబస్తీలో తిరుగులేని శక్తిగా మారుస్తున్నాయని చెప్పొచ్చు.
త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని మజ్లిస్ ఊవ్విళ్లూరుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో తన సత్తా ఏమిటో చాటిన మజ్లిస్.. తెలంగాణ రాష్ట్రంలోనూ.. తన పట్టు తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేయాలని భావిస్తోంది. తెలంగాణ అధికారపక్షానికి రహస్య మిత్రుడిగా ఉన్నప్పటికి ఇరు వర్గాల మధ్యనున్న పల్చటి తెర ఎవరికి వారు తమ అధిక్యతను ప్రదర్శించుకోవాలన్న ఆలోచన ఉండటంతో.. గ్రేటర్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనంత జాగ్రత్తగా మజ్లిస్ ప్లానింగ్ చేస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 43 వార్డుల్లో విజయం సాధించిన మజ్లిస్..తాజా ఎన్నికల్లో 55 వార్డుల్లో విజయాన్ని నమోదు చేసి.. తానేంటో నిరూపించుకోవాలన్న తపన మజ్లిస్ అధినేతలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి.. మజ్లిస్ ఆశలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.