Begin typing your search above and press return to search.

ఎంఐఎం సరికొత్త వ్యూహం.. వాళ్లు కరుణిస్తారా?

By:  Tupaki Desk   |   30 Nov 2018 9:32 AM GMT
ఎంఐఎం సరికొత్త వ్యూహం.. వాళ్లు కరుణిస్తారా?
X
ఎన్నికల వేళ హోరాహోరీ ప్రచారంలోనూ ఎంఐఎం నేతలు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. పాత బస్తీలో అధిక శాతంలో ఉన్న మహిళా ఓట్లపైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారు. వేర్వేరు చోట్ల సభలు - సమావేశాలు ఏర్పాటు చేసి ఆకట్టుకునే పనిలో పడ్డారు.

పాత బస్తీలో ఎంఐఎం పార్టీకి ఉన్నక్రేజ్ కొంచెం ఎక్కువే. ఇప్పటికే టీఆర్ ఎస్ - ఎంఐఎం ఓ అవగాహనతోనే ఉన్నాయి. కేసీఆర్ తో కాలుదువ్వుతున్న మహా కూటమి అభ్యర్థులు కూడా బలంగానే పాతబస్తీలో తమ వాణిని ప్రజలకు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ కు సరైన మెజారీటి రాకపోతే - ఎంఐఎం సాయం తీసుకోవడం ఖాయమనేది అందరికీ తెలిసిన విషయమే.

మేమే కింగ్ మేకర్లం.. కింగ్ డిసైడర్లం అని.. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ బహిరంగ సభల్లో చెప్పేశారు. దీంతో ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా మహిళల ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించారు. నేరుగా పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీనే మహిళలతో ఏర్పాటు చేస్తున్న సభల్లో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో పురుషుల ఓట్లే శాతమే ఎక్కువగా నమోదవుతుందని, ఈ సారి మహిళల ఓటింగ్ శాతం పెరగాలని సూచిస్తున్నారు. అంతేగాక, మగాళ్లు చెప్పిన మాట మీద చాలా మంది ఉండరు... అదే మహిళలు వాగ్దానం చేస్తే తప్పక చేస్తారు.

ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ రచిస్తున్న మహిళా ఓటింగ్ వ్యూహం ఫలిస్తే గెలుపుతో పాటు - ఓట్ల శాతం పెరగకతప్పదు. పాతబస్తీలో తిరుగులేదని చెబుతున్న మజ్లిస్ నేతల వ్యూహం ఎటువంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే.