Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై ఒవైసీ బ్రదర్స్ కన్ను

By:  Tupaki Desk   |   28 Dec 2016 7:28 AM GMT
ఏపీ రాజధానిపై ఒవైసీ బ్రదర్స్ కన్ను
X
ఒవైసీ బ్రదర్సు పేరు చెబితే చాలు.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ, వారి వాక్పటిమను మాత్రం మెచ్చుకుంటారు. ఉర్దూ - హిందూ - ఇంగ్లిష్ లో వారు మాట్లాడితే ఎదురు నిలవడం కష్టమే. అన్నదమ్ములు ఇద్దరూ ఇద్దరే. శాసనసభలోనైనా - పార్లమెంటులోనైనా అనర్గళంగా మాట్లాడుతారు. విభజన తరువాత తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ హిందీలో - ఉర్దూలో మాట్లాడితే కొందరు నేతలు సమాధానమివ్వగలుగుతున్నారు కానీ ఆయన ఇంగ్లీష్ లో మొదలుపెడితే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ మాత్రమే ఎదుర్కోగలుగుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ఒవైసీ సోదరులిద్దరూ కొత్తగా తెలుగు కూడా నేర్చుకుంటున్నారట. ఇప్పటికే టీచర్ ని పెట్టుకుని మరీ తెలుగు నేర్చుకుంటున్న అసదుద్దీన్ సోదరులు పూర్తిగా నేర్చుకుని తెలుగు మాట్లాడతామని చెబుతున్నారు.

ప్రస్తుతం వారికి తెలుగు వచ్చినా అది అరకొరే. అయితే.. తాజాగా వారు ఇంత పెద్ద ప్రయత్నం ఎందుకు చేస్తున్నారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బలంగా ఉన్న తమ పార్టీ ఎంఐఎంను ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ - గుంటూరుల్లోనూ విస్తరించే ఆలోచనతో అక్కడ ఇకపై తాము సభలు - సమావేశాలు పెట్టే ఆలోచనతో ఈ స్టెప్ తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందుకూడా ఎంఐఎం ఎక్కువగా తెలంగాణకే పరిమితం. హైదరాబాద్ కాకుండా నిజామాబాద్ - కరీంనగర్ - ఆదిలాబాద్ లో కొంతవరకు ఉంది. రాయలసీమలో కర్నూలులో చాలా స్వల్పంగా కొద్దికాలం ఉనికి చాటుకుంది. కానీ... మొన్నటి ఎన్నికల తరువాత దేశమంతా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఆ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. బీహార్ - బెంగాల్ లోనూ విస్తరణకు ట్రయ్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీలోనూ విస్తరించాలన్నది ఒవైసీల వ్యూహంగా తెలుస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న గుంటూరుతో పాటు విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ఇలా తెలుగు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/