Begin typing your search above and press return to search.

అసద్ కన్ను తమిళనాడు మీద పడింది

By:  Tupaki Desk   |   5 April 2016 5:18 PM GMT
అసద్ కన్ను తమిళనాడు మీద పడింది
X
దేశం మొత్తంగా మజ్లిస్ పార్టీని విస్తరించాలన్న భారీ ఆలోచనల్లో ఉన్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పావులు కదపటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా.. మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల మీద కన్నేయటం.. అక్కడ పోటీకి దిగుతూ హడావుడి చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ పాతబస్తీలో తాను ప్రయోగించే ఫార్మూలాను దేశవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉండే నియోజవర్గాల్లో అమలు చేయాలన్నది అసద్ ఎత్తుగడ.

ఇందులో భాగంగా మహారాష్ట్రంలో ఆయన వ్యూహం ఫలిస్తే.. బీహార్ ఎన్నికల్లో మాత్రం ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అసద్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నియోజకవర్గాల్లో పోటీకి దిగాలని నిర్ణయించారు. చెపాక్.. వాణియంబాడి.. కృష్ణగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని అసద్ ప్రకటించారు. మరి.. తమిళనాడులో తన మార్క్ ను అసద్ ప్రదర్శిస్తారా? అన్నది చూడాలి.