Begin typing your search above and press return to search.
పీవీకి భారతరత్నను వ్యతిరేకించిన ఎంఐఎం
By: Tupaki Desk | 8 Sept 2020 11:01 PM ISTమాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం అయిన ‘భారత రత్న’ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ తీర్మానాన్ని అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టారు.
ఈ ప్రతిపాదన పై అధికార పార్టీతోపాటు కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు తెలిపారు. దేశప్రధానిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
అయితే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం మాత్రం వ్యతిరేకించడం విశేషం. పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా మజ్లిస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సభ నుంచి వాకౌట్ చేసింది.
ఇక పీవీకి ‘భారతరత్న’ తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.