Begin typing your search above and press return to search.

మేయర్ పీఠం: టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు.. అసద్ వైఖరేంటి?

By:  Tupaki Desk   |   5 Dec 2020 2:25 PM GMT
మేయర్ పీఠం: టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు.. అసద్ వైఖరేంటి?
X
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కనుందనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఈ పార్టీ చేరుకోలేకపోయింది. దీంతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మేయర్ పీఠంపై తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఫలితాల అనంతరం ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ తమను సంప్రదించలేదని అన్నారు. టీఆర్ఎస్ కు మద్దతుపై తమ పార్టీలో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అసద్ తెలిపారు.

టీఆర్ఎస్ కు గ్రేటర్ లో ఓట్లు ఎందుకు తగ్గాయో ఆ పార్టీనే అడగాలని అసద్ ఎదురు ప్రశ్నించారు. గ్రేటర్ లో తమకు దక్కిన సీట్ల పట్ల సంతృప్తిగా ఉన్నామని.. తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీడీపీ, వైసీపీ, వామపక్షాలు, ఇతర పార్టీలు ఉనికి కోల్పోవడంతో వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించిందన్నారు.

150 డివిజన్లతోపాటు ఎక్స్ అఫీషియో కలుపుకుంటే మేజిక్ మార్క్ 102గా ఉంది. కానీ టీఆర్ఎస్ సంఖ్యా బలం 92 మాత్రమే. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో పార్టీ మద్దతు అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది వేచిచూడాలి.