Begin typing your search above and press return to search.

దేశం విడిచిపోతున్న సంప‌న్నులు..రీజ‌న్ ఇదేనా..!

By:  Tupaki Desk   |   7 July 2019 10:59 AM GMT
దేశం విడిచిపోతున్న సంప‌న్నులు..రీజ‌న్ ఇదేనా..!
X
దేశంలో భారీగా సంపాయించుకున్న భారీ వ్యాపార వేత్త‌లు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ విష‌యం కొన్ని ద‌శాబ్దాలు గా మ‌న‌కు వినిపిస్తున్న మాటే! ల‌క్ష్మీ మిట్ట‌ల్ స‌హా అనేక మంది వ్యాపార‌స్తులు - వాణిజ్య వేత్త‌లు కూడా దేశంలో కోట్లాది రూపాయ‌లు సంపాయించుకుని విదేశాల‌కు వెళ్లిపోయారు. విదేశాల్లో హీరోలుగా చ‌లామ‌ణి అవుతున్న వీరంద‌రినీ మ‌న రాజ‌కీయ నేత‌లు జీరోలుగానో.. లేక నెగిటివ్ పాత్ర‌ల్లోనో చిత్రీక‌రిస్తున్నారు. వాస్త‌వ విష‌యాల‌ను వ‌దిలి పెట్టి.. వారు ప‌లాయ‌నం చిత్త‌గించార‌ని - దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవ‌డంలో చిత్త శుద్ధి చూప‌డం లేద‌ని మ‌నోళ్లు తెగ ప్ర‌సంగాలు గుప్పిస్తారు.

అయితే, వాస్త‌వ విష‌యాన్ని మాత్రం రాజ‌కీయ నాయ‌కులు విస్మ‌రిస్తుండ‌డం ఇప్పుడు ప్ర‌స్తావ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. మ‌న దేశంలో సంప‌న్న వ‌ర్గాల‌పై ప‌న్నుల భారం ఎక్కువ‌. వారు చేసే వ్యాపారాలు - వ‌స్తున్న రాబ‌డికి కూడా ప‌న్ను లు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. వారు రూ.100 సంపాయిస్తే..రూ.43 ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వమే త‌న ఖాతాలో వేసుకుంటుంది. మ‌రి ఈ ప‌రిస్థితి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అయితే, ఆ ప‌రిస్థితి లే దు. బ్రిట‌న్ స‌హా సింగ‌పూర్ త‌దిత‌ర దేశాల్లో పారిశ్రామిక వేత్త‌ల‌పై ప‌న్ను పోటు పెద్ద‌గాలేదు.

పైగా అక్క‌డ ఉపాధిని పెంచే క్ర‌మంలో పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌భుత్వ‌మే నేరుగా ప్రోత్సాహ‌కాలు అందిస్తుంది. ఎంత ఎక్కువ మందికి ఉపాధి - ఉద్యోగాలు క‌ల్పిస్తారో.. ఆయా పారిశ్రామిక వేత్త‌ల‌పై అంత త‌క్కువ‌గా ప‌న్ను పోటు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మ‌న దేశానికి చెందిన అనేక మంది పారిశ్రామిక వేత్త‌లు.. ఇత‌ర దేశాల‌కు వెళ్లి ప‌రిశ్ర‌మ‌లు స్థాపిస్తున్నారు. గ‌ణ‌నీయంగా వ్యాపారాల‌ను వృద్ధి చేసుకుంటున్నారు. పైగా ఆయా దేశాల్లో మౌలిక స‌దుపాయాలు - అవినీతి ర‌హిత ప్ర‌భుత్వాలు ఉండ‌డం వీరికి క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం.అదేస‌మ‌యంలో పొల్యూష‌న్ కంట్రోల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్వ‌చ్ఛ‌మైన గాలి, నీరు ల‌భ్య‌మ‌వుతాయి. మ‌రి ఇన్ని విధాలుగా పాజిటివ్ ఉన్న‌ప్పుడు మ‌నోళ్లు విదేశాల‌కు వెళ్లి స్థిర‌ప‌డితే.. త‌ప్పేంటి?! ఒక్క‌సారి ఆలోచించండి!