Begin typing your search above and press return to search.

మిలియన్ మార్చ్ .. అయోధ్య పై తీర్పు .. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది..!

By:  Tupaki Desk   |   9 Nov 2019 5:39 AM GMT
మిలియన్ మార్చ్ .. అయోధ్య పై తీర్పు .. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది..!
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 36 వ రోజుకి చేరింది. ఈ సమ్మె పై ప్రభుత్వం కానీ , ఆర్టీసీ కార్మికులు కానీ బెట్టు విడకపోవడం తో ఈ సమస్యకి పరిష్కారం దొరకడం లేదు. ఈ సమయం లోనే సీఎం కేసీఆర్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలకు ఆర్టీసీ కార్మికులు పట్టు విడవకుండా తమ హక్కులని సాధించుకునే వరకు సమ్మె ని ఆపేదే లేదు అని చెప్తున్నారు. మరో వైపు ప్రభుత్వం మాత్రం ..ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడం కుదరదు అని తేల్చి చెప్తుంది. ఈ నేపథ్యం లోనే నేడు ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ కి పిలుపునిచ్చారు. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ చలో ట్యాంక్ బండ్ కి వేలాదిగా తరలి రావాలని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే ఈ సమ్మెకి ప్రతి పక్షాలు కూడా మద్దతు ఇవ్వడం తో మిలియన్ మార్చ్ ని ఎలాగైనా విజయం చేయాలనీ చూస్తున్నారు. కానీ , ఆర్టీసీ కార్మికులు చేస్తున్న మిలియన్ మార్చ్ కి అనుమతి లేదు అంటూ పోలీసులు ట్యాంక్ బండ్ పైకి ఎవ్వరూ రాకుండా భారీ కేడ్లు అడ్డుపెట్టారు. ఎవరైనా ట్యాంక్‌బండ్‌ పరిసరా ల్లో కనిపిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. అయినా.. ఇప్పటి కే పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండం తో ముందస్తు అరెస్ట్‌ లకు తెరతీశారు పోలీసులు.

మిలియన్ మార్చ్ నేపథ్యం లో రాష్ట్రంలో అర్థ రాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జేఏసీ కో కన్వీర్‌ రాజి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాజా సింగ్‌ను, పొన్నాల లక్ష్మయ్యను హౌస్‌ అరెస్ట్ చేశారు. దీంతో.. అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డి, జేఏసీ నేతలు అజ్ఞాతం లోకి వెళ్లి పోయారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీ నేతలని , మిలియన్ మార్చ్ కి వస్తున్న ఆర్టీసీ కార్మికులని పోలీసులు ఎక్కడి కక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్స్ కి తరలిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే కనీసం ట్యాంక్ బండ్ పైకి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా పోలీసులు అనుమతించక పోవడంతో ఉద్యోగాలకు, కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మూసి వేసి, ట్రాఫిక్‌ మళ్లించడం తో కష్టాలు పడుతున్నామని స్థానికులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల కళ్లు గప్పి ట్యాంక్‌బండ్‌ చేరుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, విద్యార్థులు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. బెదిరింపులకు , అరెస్టులకు కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇకపోతే మరో వైపు ఈ రోజు అయోధ్య లో వివాదాస్పద స్థలం పై తుది తీర్పు వెల్లడించనున్న నేపథ్యం లో అన్ని రాష్ట్రాలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. ఒకవైపు మిలియన్ మార్చ్ , మరోవైపు అయోధ్య కేసు నేపథ్యం లో హై అలర్ట్ ఉండటం తో హైదరాబాద్ లో ఏంజరుగుతుందో అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. దీనితో ప్రభుత్వం కూడా గట్టి బందో బస్తు ఏర్పాటు చేసింది.