Begin typing your search above and press return to search.

యూఎస్ లో తొలి సిక్కు మేయర్ గా మైకి హోతి..!

By:  Tupaki Desk   |   26 Dec 2022 4:25 AM GMT
యూఎస్ లో తొలి సిక్కు మేయర్ గా మైకి హోతి..!
X
ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన భారతీయులు ఆయా దేశాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ భారతీయుల హవానే కొనసాగుతోంది. టెక్నాలజీ.. వ్యాపార దిగ్గజ కంపెనీలన్నీంటికి మనోళ్లే సీఈవోలు వ్యవహరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ కీలక పదవులు దక్కించుకుంటూ వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు.

ఇటీవల ప్రవాసీ భారతీయుడు రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. వందేళ్లు భారత్ ను పాలించిన బ్రిటిష్ కు నేడు ఒక భారతీయుడు ప్రధానిగా ఎన్నికై వారినే పాలించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇది నిజంగా భారతీయులందరికీ గర్వకారణం. ఆయన కాకుండా వివిధ దేశాల్లో ప్రవాసీ భారతీయులు రాజకీయాల్లో సత్తా చాటుతూ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కించుకుంటుండటం గమనార్హం.

అమెరికాలో గత అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి ములాలు కలిగిన కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు అమెరికాలోని ప్రవాసీ భారతీయులంతా మద్దతు తెలుపడంతో వైస్ ప్రెసిడెంట్ గా ఆమె ఎన్నికయ్యారు. అంతేకాకుండా అమెరికాలోని పలు రాష్ట్రాలకు ప్రవాసీ భారతీయులు గవర్నర్లుగా.. మేయర్లు ఎన్నికైన సంగతి తెల్సిందే. తాజాగా భారత సంతతి చెందిన మైకి హోతి అమెరికాలో అరుదైన రికార్డును సాధించాడు.

ఉత్తర కాలిఫోర్నియాలోని 'లోది' నగర మేయర్ గా మైకి హోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోది నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్ గా ఘనత సాధించాడు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం నవంబర్లో పూర్తి కొత్త మేయర్ ఎన్నిక కోసం తాజా కౌన్సిలర్లు ఇటీవల భేటి నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ వుహన్ లీసా క్రెయిగ్.. మైకి హోతిని మేయర్ గా ప్రతిపాదించగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

మైకి హోతి 5వ జిల్లాకు కౌన్సిలర్ గా.. ఉప మేయర్ గా సేవలించారు. ప్రస్తుతం లోది మేయర్ గా మైకి హోతి ఎన్నికవగా.. కౌన్సిలర్ లీసా క్రెయిగ్ డిప్యూటి మేయర్ నియామకమయ్యారు. ఈ మేరకు మైకి హోతి "లోది నగర 117వ మేయర్ గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉందని" ట్విట్ చేశారు.

కాగా మైకి హోతి తల్లిదండ్రులు భారత్ లోని పంజాబ్ కు చెందినవారని.. ఆర్మ్ స్ట్రాగ్ రోడ్ లోని సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆ కుటుంబం కీలక పాత్ర పోషించారని స్థానిక మీడియా వెల్లడించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.