Begin typing your search above and press return to search.
తొలి డిబేట్: మైక్స్ పెన్స్ పై కమలా హ్యారిస్ ఉగ్రరూపం
By: Tupaki Desk | 8 Oct 2020 12:30 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండో డిబేట్ వాడివేడిగా సాగింది. మొదట అధ్యక్ష అభ్యర్థులైన ట్రంప్, జోబిడైన్ పోటీపడగా.. రెండో డిబేట్ అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలుచున్న డెమొక్రటిక్, రిపబ్లికన్ పోటీదారులు మైక్ పెన్స్, కమలాహారిస్ మధ్య సాగింది.
ఈ రెండో డిబేట్ లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉగ్రరూపం చూపించారు. ఈ చర్చలో మైక్ పెన్స్ సమాధానాలను తప్పు పడుతూ కమలా హ్యారిస్ రెచ్చిపోయారు. మైక్ పెన్స్ పై ఆమె పలు సందర్భాల్లో ఎదురుదాడికి దిగారు.
ముఖ్యంగా ఈ డిబేట్ లో చైనాతో ట్రేడ్ వార్, కరోనా నియంత్రణ, అమెరికా ఆర్థిక పరిస్థితులు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చలో మైక్ పెన్స్ పై కమలా హ్యారిస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
చైనా అంశం చర్చకు వచ్చినప్పుడు కమలా హ్యారిస్ చెలరేగిపోయారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని.. వీధిన పడ్డారని ఆరోపించారు. చైనాతో ట్రేడ్ వార్ తో అధ్యక్షుడు ట్రంప్ ఏం సాధించారని కమలా హ్యారిస్ ప్రశ్నకు మైక్ పెన్స్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ ట్రేడ్ వార్ తో అమెరికాలో ఉత్పాదక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. తయారీ రంగానికి చెందిన 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆమె ఆరోపించారు.
ట్రంప్ అమెరికాతో చిరకాలంగా సంబంధాలున్న అన్ని దేశాలను దూరం చేశారని కమలా హ్యారిస్ ఆరోపించారు. అమెరికాకు ఇప్పుడు మిత్రులు లేకుండా పోయారని మండిపడ్డారు.
ఇక మైక్ పెన్స్ అమెరికాను అగ్రరాజ్యంగా కొనసాగింపజేసేలా తమ ఎన్నికల ప్రణాళిక ఉందని.. అమెరికన్లే ఫస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్నామని చెప్పారు.
యువతకు ఉపాధిని కల్పించడానికి.. ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.