Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు మంగళం పాడిన మైక్రోసాఫ్ట్...

By:  Tupaki Desk   |   14 Jun 2022 2:34 AM GMT
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు మంగళం పాడిన మైక్రోసాఫ్ట్...
X
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్.. కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి ఈ బ్రౌజర్ గురించి తెలుసు. ఇది లేకుండా అసలు కంప్యూటరే ఉండదు. ఈ ఎక్స్ ప్లోరర్ 1955 లో తొలిసారిగా విడుదలైంది. మొదట యాడ్ ఆన్ ప్యాకేజీ ప్లస్ ఫర్ విండోస్ 95లో భాగంగా దీన్ని ఇంటర్నెట్ వినియోగదానికి విడుదల చేశారు. అయితే ఇప్పుడు దీని కథ ముగిసింది. మైక్రోసాఫ్ట్ దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది.

మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్ ల శ్రేణిలో ఇది తొలి బ్రౌజర్ గా ఖ్యాతికెక్కింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై 1995లో తొలిసారిగా విడదులైంది. మొదట కాస్ట్ పెట్టి ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అందుబాటులోకి తెచ్చింది.

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్. 2003 నాటికి ఇది 95శాతం వినియోగద వాటా దీనిదే. తర్వాత ఈ వాటా తగ్గడం ప్రారంభించింది.

ఫైర్ ఫ్యాక్స్ 2004, గూగుల్ క్రోమ్ 2008లో ప్రారంభం కావడంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కు ఆదరణ తగ్గిపోయింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టంలకు పెరుగుతున్న ప్రజాదరణతో దీని వినియోగ డేటా క్షీణించింది.

ఈ క్రమంలోనే అన్ని ఫ్లాట్ ఫారమ్ లపై ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ యొక్క మార్కెట్ వాటా 2.28 శాతం మాత్రమే అంటే దీని క్షీణత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ తాజాగా ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఓల్డెస్ట్ బ్రౌజర్ కు ఇక రిటైర్మెంట్ ప్రకటించనుంది. 27 ఏళ్ల పాటు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ సేవలందించింది. ఈనెల 15 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండవు.

యూజర్ ఇంటర్ మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తేవడంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తన ఆదిపత్యాన్ని కోల్పోయింది. రాబోయే తరంలో విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది భద్రతతో కూడిన వేగవంతమైన బ్రౌజింగ్ అనుభవం వినియోగదారులకు అందిస్తోంది.