Begin typing your search above and press return to search.

కన్నడ విద్యార్థి అన్వేషణ ఫలితం.. ప్లాస్టిక్ తినే క్రిముల్ని గుర్తించాడు

By:  Tupaki Desk   |   19 Sept 2020 5:00 AM IST
కన్నడ విద్యార్థి అన్వేషణ ఫలితం.. ప్లాస్టిక్ తినే క్రిముల్ని గుర్తించాడు
X
భూమిలో పడిన ఏ వస్తువు అయినా సరే.. కలిసిపోవటం మామూలే. కాకుంటే.. ప్లాస్టిక్ తో ఇబ్బందేమంటే.. అది భూమిలో కలిసిపోవటానికి వందలాది ఏళ్లు తీసుకుంటుంది. ఈ కారణంతో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షల గురించి తెలిసిందే. అయితే.. ఈ వాదనకు చెక్ చెప్పటమే కాదు.. కన్నడ విద్యార్థి ఒకరు సంచలన అంశాన్ని గుర్తించారు.

భూమిలో పడిన ప్లాస్టిక్ ను తినేసే క్రిముల్ని కన్నడ విద్యార్థి శీతల్ కెస్తి గుర్తించాడు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని తినేసి.. పర్యావరణానికి మేలు చేసే సూక్ష్మక్రిములు ఉన్నట్లుగా గుర్తించటమే కాదు.. వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధార్వాడలోని కర్ణాటక విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగాధిపతి డాక్టర్ శివకరణ మార్గదర్శకంలో శీతల్ పని చేస్తున్నాడు.

అతగాడి అన్వేషణ ఫలించిందని.. ప్లాస్టిక్ ను తినే సూక్ష్మక్రిముల్ని గురించటం ద్వారా.. వాటిని మరింతగా పెంచేయటంతో.. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను అధిగమించే వీలుందని చెప్పొచ్చు. భూమిలో అంతకంతకూ పేరుకు పోతున్న ప్లాస్టిక్ సమస్యకు దీంతో పరిష్కారం లభించినట్లే. ఇదే అంశంపై ఇంగ్లండ్ లో పరిశోధనలు జరుగుతున్నట్లుగా తెలుసుకున్న శీతల్.. తన ప్రయత్నంగా చేసిన ప్రయత్నం ఫలించటమే కాదు.. సరికొత్త అంశం మానవాళికి తెలిసేలా చేశారని చెప్పక తప్పదు.