Begin typing your search above and press return to search.

ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్ !

By:  Tupaki Desk   |   18 Aug 2020 3:20 PM IST
ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్ !
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ నిప్పులు చెరిగారు. ఈ వైట్ హౌస్ ని చూసినప్పుడల్లా..ఓరిమి, సహనం,శాంతి బదులు అరాచకాలు, ప్రజలంటే ఏ మాత్రం లక్ష్యంలేని విధానాలు కనబడతాయని ఆరోపణలు చేసారు. అమెరికా అధినేత గా ఉండటానికి ట్రంప్ తగడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్కాన్సిన్ లో జరిగిన డెమొక్రటిక్ కన్వెన్షన్ లో మాట్లాడిన మిషెల్ ఒబామా .. వచ్చే ఎన్నికల్లో జో బిడెన్ గెలిచి అధ్యక్షునిగా ఎన్నికైతే , ప్రజలకు అన్ని వాస్తవాలు తెలియజేస్తారని, సైన్స్ ని విశ్వసిస్తారని తెలిపారు.

అమెరికా లో కరోనా విస్తరిస్తున్న సమయంలో కూడా కరోనా పై నిపుణులు చెబుతున్న సలహాలను, చేస్తున్న సూచనలను అసలు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న అధినేత ట్రంప్ ను ఉద్దేశించి ఆమె పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జోబిడెన్ తన ఎనిమిదేళ్ల ఉపాధ్యక్ష పదవీ కాలంలో చక్కని ప్రతిభ కనబరిచారని, ఆయనను మంచి మనసు గల మనిషి అని తెలిపారు. ఆయన గురించి తనకు తెలుసునని, ఆత్మవిశ్వాసంతో పని చేసే బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ దేశాన్ని మరింత అభివృధ్ది పథంలో నడిపిస్తారని ఆమె వెల్లడించారు. ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించి జో బిడెన్ ని అధ్యక్షునిగా, కమలా హారిస్ ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని మిషెల్ అమెరికా వాసులకి పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ఆన్ లైన్ ద్వారా ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈమె ఇప్పుడే ఈ మధ్య కాలంలో వీలు చిక్కినప్పుడల్లా ట్రంప్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.