Begin typing your search above and press return to search.

డిఫ్రెషెన్ తో భాదపడుతున్న మిచెల్ ఒబామా .. అసలు కారణం ఇదే !

By:  Tupaki Desk   |   7 Aug 2020 2:00 PM IST
డిఫ్రెషెన్ తో భాదపడుతున్న మిచెల్ ఒబామా .. అసలు కారణం ఇదే !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా సతమతమౌతుంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే నమోదు అయిన కరోనా కేసుల్లో చాలా వరకు కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు అయ్యాయి. అలాగే అమెరికాలో కరోనాతో పాటుగా జాతి వివక్ష ఆందోళనలు, రాజకీయాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ట్రంప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.

కరోనా , వర్ణ వివక్ష పరిస్థితులు ఆమెని తీవ్రంగా కలచి వేస్తున్నాయని ఆవేదన వక్తం చేస్తున్నారు. అమెరికాలో నల్ల జాతీయులు అనుభవిస్తున్న క్షోభ నాకు తెలుసు అని , నేను అప్పుడప్పుడు రాత్రి పూట నిద్ర నుంచి లేచి కూర్చుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే ప్రభుత్వంలో మార్పు రావాలని తెలిపారు. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక ఇబ్బంది గురించి ఆమె వివరించారు. అలాగే కొందరు మానసిక ఒత్తిడితో మాస్క్‌లు ధరించేందుకు నిరాకరిస్తూ గొడవపడుతున్న ఘటనల గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్‌పై పోరాటం నేపథ్యంలో పలువురు సహనాన్ని కోల్పోతున్నారని అన్నారు. గతంలో ఏ తరంలో ఎవరూ ఎదుర్కోని పరిస్థితులను ప్రస్తుతం అమెరికన్లు కరోనా కారణంగా ఎదుర్కొంటున్నారని అన్నారు.