Begin typing your search above and press return to search.

మిచెల్ జాన్సన్ కు హోటల్ గదిలో వింత అనుభవం

By:  Tupaki Desk   |   20 Sept 2022 2:15 PM IST
మిచెల్ జాన్సన్ కు హోటల్ గదిలో వింత అనుభవం
X
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం భారత్ లో ఉన్నారు. 'లెజెండ్స్ లీగ్ ' క్రికెట్ లో రిటైర్ అయిపోయిన క్రికెటర్లతో కలిసి ఆడుతున్నారు. ఈ లీగ్ లో పాల్గొనడానికి వచ్చిన మిచెల్ భారత్ లోని లక్నోలో ప్రస్తుతం హోటల్ గదిలో ఉండగా ఆయనకు వింత అనుభవం ఎదురైంది.

మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో ఒక పాము కలకలం సృష్టించింది. మిచల్ జాన్సన్ 'ఇండియా క్యాపిటల్స్' జట్టు తరుఫున ఆడుతున్నాడు. ఆ జట్టు తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలై రెండో మ్యాచ్ కోసం రెడీ అవుతుడగా ఈ ఘటన చోటుచేసుకుంది.

21న లక్నో వేదికగా క్యాపిటల్స్ మ్యాచ్ కోసం మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో బస చేయగా.. జాన్సన్ గదిలో పాము కలకలం సృష్టించింది. అందుకు సంబంధించిన ఫొటోలను జాన్సన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

'ఇది ఎలాంటి పాము? ఎవరికైనా తెలుసా?' అంటూ క్యాప్షన్ జత చేశాడు. చూడడానికి పాము పిల్లలా ఉన్న ఈ పాము అంతపెద్ద 5 స్టార్ హోటల్ లోకి ఎలా చొచ్చుకొచ్చిందన్నది ఆరాతీస్తుంది. ఇది ఖచ్చితంగా హోటల్ సిబ్బంది నిర్లక్ష్య ఫలితమేనని అంటున్నారు. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే క్రికెటర్ల ప్రాణాలకు భద్రత ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇండియాలో ఈ ఘటన జరగడంతో ఆటగాళ్లకు రక్షణ లేదు అన్న వాదన వచ్చేది. అంతర్జాతీయ క్రికెటర్లు ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే భారత ప్రతిష్టకు దెబ్బ పడడం ఖాయం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.