Begin typing your search above and press return to search.

సత్యనాదెళ్లకు ​ప్రత్యేక ​ గౌరవం

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:47 AM GMT
సత్యనాదెళ్లకు ​ప్రత్యేక ​ గౌరవం
X
మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు వ్యక్తి సత్యనాదెళ్లకు మరో ​ప్రత్యేక ఆహ్వానం అందింది. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎదిగి తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన సత్య నాదెళ్లను అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశించి అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసే ప్రసంగ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం లభించింది.

ఈ మేరకు సత్యనాదెళ్లకు ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఆహ్వానాన్ని పంపిచారు. ముఖ్యంగా ఇక్కడ అమెరికాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి గురించి ఒబామా మాట్లాడతారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ సమావేశంలో తుపాకి సంస్కృతి మూలంగా చనిపోయిన వారి జ్ఞాపకార్ధం ఓ సీటును ఖాళీగా ఉంచనున్నారు. ఈ సంస్కృతి మూలంగా చనిపోయిన వారు ఎలాగూ మాట్లాడలేరు కాబట్టి . .. ఈ సమావేశానికి వచ్చిన వారయినా మాట్లాడాలని ఒబామా భావిస్తున్నట్లు తెలు​స్తోంది.​