Begin typing your search above and press return to search.

సెల్ఫీ తీశాడ‌ని... లాగి పీకింది

By:  Tupaki Desk   |   29 Jun 2017 10:16 AM GMT
సెల్ఫీ తీశాడ‌ని... లాగి పీకింది
X
వెండి తెర వేల్పుల్ని ప‌బ్లిక్ ప్లేసుల్లో చూస్తే స‌గ‌టు అభిమాని ఎలా రియాక్ట్ అవుతారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటిది.. ఆ ఏకంగా పోర్న్‌ స్టార్‌ ను రోడ్డు మీద చూసిన‌ప్పుడు ఒక అభిమాని రియాక్ట్ అయిన తీరు.. అందుకు ఆ పోర్న్ స్టార్ స్పందించిన తీరు ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

అమెరికాలోని టెక్సాస్ వీధుల్లో మియా ఖ‌లిఫా అనే మాజీ పోర్న్ స్టార్ రోడ్డు మీద వెళుతోంది. ఇక్క‌డ ఈ అమ్మ‌డు గురించి చెప్పాలి. అమాయ‌క‌త్వానికి పోత పోసిన‌ట్లుగా ఉండే ఈ అమ్మడు పోర్న్ స్టార్ గా దుమ్ము రేపిందని చెబుతారు. త‌న చేష్ట‌ల‌తో అడ‌ల్ట్ మూవీస్‌ లో రెచ్చిపోయిన‌ట్లుగా పేరుంది. త‌ర్వాతి కాలంలో ఆ ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

వెబ్ ప్ర‌పంచంలో చూసే పోర్న్ స్టార్ క‌ళ్ల ముందు క‌నిపించేస‌రికి హ‌డ్ స్పెత్ అనే కుర్రాడు ఇక ఆగ‌లేక‌పోయాడు. ఆమెతో సెల్ఫీ దిగాల‌నుకున్నాడు. ఆమెతో క‌లిసి ఫోటో తీసుకునేట‌ప్పుడు ఆమె అనుమ‌తి తీసుకోవాల‌న్న క‌నీస ధ‌ర్మాన్ని మ‌రిచాడు. ఆమె ముఖానికి ద‌గ్గ‌ర‌గా త‌న ముఖాన్ని పెట్టి సెల్ఫీ తీసుకున్నాడు.

దీంతో ఒళ్లు మండిన మియా ఖ‌లిఫా.. ఆ కుర్రాడి ముఖం మీద ఒక్క పంచ్ ఇచ్చింది. అయితే.. మాజీ పోర్న్ స్టార్ కొట్టిన దెబ్బ‌ను లైట్ తీసుకున్న ఆ కుర్రాడు.. త‌న ముఖం మీద దెబ్బ‌ను చూపిస్తూ.. ఖ‌లిఫాతో ఫోటో దిగాను. ముఖం మీద గుద్దింది.. గాయ‌మైందంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టేశాడు. ఇంకేముంది.. ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. దీనిపై ఖ‌లిఫా స్పందించింది. గుర్తు తెలియ‌ని యువ‌కుడు ముఖానికి ద‌గ్గ‌ర‌గా వ‌స్తున్నాడ‌నే తాను ముఖం మీద పంచ్ ఇచ్చాన‌ని పేర్కొంది. ఈ ఉదంతంపై నెటిజ‌న్లు మిశ్ర‌మ స్పంద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/