Begin typing your search above and press return to search.

పోలింగ్ స్పెష‌ల్‌..మెట్రో రైల్ ప్ర‌త్యేక ఆఫ‌ర్

By:  Tupaki Desk   |   7 Dec 2018 6:30 AM GMT
పోలింగ్ స్పెష‌ల్‌..మెట్రో రైల్ ప్ర‌త్యేక ఆఫ‌ర్
X
తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్ర‌త్యేక స‌దుపాయం క‌ల్పించింది. పోలింగ్ సిబ్బందితో పాటు నగర ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఇవాళ(శుక్రవారం) మెట్రో రైళ్ల సమయాన్ని ఒక గంట పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో చివరి ట్రైన్ 10.30 గంటలకు బయలుదేరుతుండగా ఈరోజు మాత్రం నాగోల్ - మియాపూర్ - ఎల్బీ నగర్ మెట్రోస్టేషన్ ల నుంచి చివరి ట్రైన్ రాత్రి 11.30 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇక అమీర్‌ పేట మెట్రో స్టేషన్‌ నుంచి చివరి ట్రైన్ రాత్రి 12.15 గంటలకు బయలు దేరుతుందన్నారు.

ఇదిలాఉండ‌గా - రాష్ట్ర‌వ్యాప్తంగా ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతోంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుండ‌గా.. స‌మ‌స్యాత్మ‌క‌(13) నియోజ‌క‌వ‌ర్గాల్లో సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కే పోలింగ్‌ కు అవ‌కాశం ఉంది. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 10 శాతం పోలింగ్ జ‌రిగింది. సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ప‌లుచోట్ల బ్యాలెట్ యూనిట్లు - వీవీ ప్యాట్ల‌ను మార్చారు. ఓటువేసేందుకు ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు.

ఆయా జిల్లాలో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు..

ఖ‌మ్మం(8శాతం) - రంగారెడ్డి(8.26శాతం) - భ‌ద్రాద్రి కొత్త‌గూడెం(9.7శాతం) - ఆసిఫాబాద్‌(8.2శాతం) - ఆదిలాబాద్‌(9.8శాతం) - మంచిర్యాల‌(10.6శాతం) - నిర్మ‌ల్‌(9.6శాతం) - క‌రీంన‌గ‌ర్‌(9.9శాతం) - సిరిసిల్ల‌(11.2శాతం) - జ‌గిత్యాల‌(12.6శాతం) - పెద్ద‌ప‌ల్లి(7.5శాతం) - న‌ల్గొండ‌(11.81శాతం) - మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌(11.5శాతం) - కామారెడ్డి(10శాతం) - నిజామాబాద్‌(7.5శాతం) - జోగులాంబ గ‌ద్వాల‌(15శాతం) - వ‌న‌ప‌ర్తి(10శాతం) - నాగ‌ర్ క‌ర్నూల్‌(5.6శాతం) - వ‌రంగ‌ల్ అర్బ‌న్‌(6.23శాతం) - వ‌రంగ‌ల్ రూర‌ల్‌(8.5శాతం) - సంగారెడ్డి(14శాతం) - సిద్ధిపేట‌(11శాతం) - మెద‌క్‌(9శాతం) - యాదాద్రి భువ‌న‌గిరి(9.5శాతం) - సూర్యాపేట‌(9.28శాతం) - జ‌న‌గామ‌(9.27శాతం) - భూపాల‌ప‌ల్లి(9.5శాతం) - మ‌హ‌బూబాద్‌(9.2శాతం) - మేడ్చ‌ల్‌(8.3శాతం) - వికారాబాద్‌(15శాతం)