Begin typing your search above and press return to search.
షాకింగ్ : మగతనం కోల్పోతున్న పురుషులు
By: Tupaki Desk | 27 Jan 2021 6:00 AM ISTరోజులు గడిచే కొద్దీ పురుషులు సంతానోత్పత్తిని కోల్పోతున్నారట.. ఈ మేరకు శాస్త్రవేత్తలు పరిశోధించి మరీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి కారణాలను కనిపెట్టారు. కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడమే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి కారణంగా చెబుతున్నారు.
ఇక మనుషుల జీవితంలో తప్పనిసరి అయిన ప్లాస్టిక్, కాస్మోటిక్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి ఉత్పత్తులతో లభించే థాలెట్స్ అనే కెమికెల్స్కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగానే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా తగ్గిపోతోందని తేల్చారు.
ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల మానవాళి ప్రశ్నార్థకంగా మారబోతోందని.. సంతానపరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోబోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
గత కొన్ని దశాబ్ధాలుగా మానవుల్లోని స్పెర్మ్ కౌంట్ వేగంగా పడిపోయిందని అధ్యయన పరిశోధక బృందం కనుగొన్నది. ఆ పరిశోధక బృందం 'థాలెట్స్ బిస్ఫెనల్ ఏ' అనే రసాయనాలు మానవ పునరుత్పత్తి సామర్థ్యాన్ని హరించి వేస్తున్నాయని కనిపెట్టారు. ఇది శారీరకంగానే కాదు.. మేధో వికాసం పరంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.