Begin typing your search above and press return to search.
మగోళ్ల పండుగ ... వింత ఏమిటంటే ?
By: Tupaki Desk | 11 Jan 2021 6:31 PM ISTదేశంలో ఎక్కడైనా కూడా దేవుళ్లు, దేవతలకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోవడం సర్వసాధారణం. కానీ, కడప జిల్లాలో మాత్రం మగవాళ్లే పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక ఆచారాన్ని చాటుతున్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ మగవాళ్ల పొంగళ్ల పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చే ముందు ఆదివారం ఆ గ్రామంలో మగవారు మాత్రమే ఆలయంలో పొంగళ్లు పెడతారు. ఈ ఆలయంలో మగవారు పొంగళ్లు పెట్టడం వింతగొలిపే ఆచారం. ఆ గ్రామానికి చెందిన వారు దేశవిదేశాల్లో ఎక్కడున్నా సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఓ రాతిని ప్రతిష్టించి దానిపై శాసనం రాశారు. దాన్నే నేటికీ సంజీవరాయుడిగా భావిస్తూ పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా మహిళలకి పెట్టరు. అక్కడే మగవారు మాత్రమే తినేస్తారు.
ఆలయ ప్రాంగణంలోకి మహిళలు రావడం పూర్తిగా నిషేధం. అయితే ఆలయ ప్రాంగణానికి వెలుపల నుంచే సంజీవరాయునికి మొక్కుకొని మహిళలు తిరుగు పయనమవుతుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ ముందు ఆదివారం రోజున తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని బట్టి సంజీవరాయ ఆలయ ప్రాంగణంలో మగవారు పొంగళ్లు పెట్టుకున్నారు. సంజీవరాయునికి ఆలయం అంటూ లేదు. ఒక రాతి శిలపై ఉన్న లిపినే ఇక్కడ సంజీవరాయునిగా కొలుస్తున్నారు. ఉదయాన్నే గ్రామంలోని మగోళ్లంతా బుట్టల్లో పొంగళ్ల సామాగ్రిని తీసుకొచ్చి సంజీవరాయుని వద్ద పొంగళ్లు పెట్టారు.
కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఓ బ్రాహ్మణుడు తిరుగుతూ ఉండేవాడని, పురుషులతో తప్ప స్త్రీలతో మాట్లాడేవాడు కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన వెళ్తూ గ్రామంలో ఓ శిలను నాటి దానిపై లిపిని రాశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం స్వామికి మగవారే పొంగళ్లు పెట్టాలని చెప్పినట్టు అక్కడ నానుడి. అప్పటినుంచి ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా ఇదో వింతే మరి.