Begin typing your search above and press return to search.

మ‌గాళ్ల‌కు పండ‌గ లాంటి వార్త చెప్పారు

By:  Tupaki Desk   |   14 March 2017 4:39 PM GMT
మ‌గాళ్ల‌కు పండ‌గ లాంటి వార్త చెప్పారు
X
వెన‌క‌టి క‌త‌ల్ని వ‌దిలేసి.. ప్ర‌జంట్‌ ను చూస్తే.. మ‌గాడికి జ‌రిగే అవ‌మానాలు.. అన్యాయాలు అన్నిఇన్ని కావు. కామెడీ స్కిట్ల‌లో పురుష స‌మాజానికి ఎన్ని క‌ష్టాలో ఏక‌రువు పెడుతుంటూ.. కామెడీ.. కామెడీగా న‌వ్వుకోవ‌టం కామ‌న్‌. నిజానికి ఆడ‌వాళ్ల‌కు ఉన్న‌న్ని హ‌క్కులు ఈ రోజు మ‌గాళ్ల‌కు లేవ‌నే చెప్పాలి.

ఆడోళ్ల‌ను ఒక ఓటు బ్యాంకుగా చూసే పార్టీలు.. రాజ‌కీయ నేత‌లున్నారు. మ‌రి.. మ‌గ‌మ‌హారాజుల్ని ఎప్పుడూ ఆ లెక్క‌లో ఎందుకు వేసుకోన‌ట్లు? అంటే.. మ‌గ‌జాతిలో లేని అనైక్య‌తే కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే ఉంటాయి. పేరుకు మ‌గాడ‌నే కానీ.. గొడ్డు చాకిరి చేసినా.. ఛీత్కారాలు త‌ర‌చూ క‌నిపిస్తూ.. వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు.. పెళ్లి త‌ర్వాత భార్య‌కు.. భ‌ర్త‌కు మ‌ధ్య‌న బాధ్య‌త‌ల పంపిణీ గ‌తంలో మాదిరి లేదు. అయిన‌ప్ప‌టికి మ‌గ‌మ‌హారాజు అన్న ట్యాగ్ పేరు పెట్టేసి.. బాధ్య‌త‌ల బ‌రువులు ట‌న్నులు ట‌న్నుల కొద్దీ వేస్తున్న వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇలాంటి వేళ‌.. మ‌గాళ్ల‌కు కొన్ని సౌక‌ర్యాలు.. సౌల‌భ్యాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రాన్ని ప్రాశ్చాత్య దేశాల్లో గుర్తించిన‌ప్ప‌టికీ.. మ‌న‌దేశంలో ఇప్ప‌టికి ఆ దిశ‌గా అడుగు పడింది లేదు. ఇలాంటి వేళ‌.. తొలిసారి దేశంలో స్వీడ‌న్ కు చెందిన ఒక విదేశీ ఫ‌ర్నిచ‌ర్ త‌యారీ సంస్థ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకుంది.

మ‌హిళ‌ల‌తో స‌మానంగా పురుషుల‌కు సైతం 26 వారాల మెట‌ర్నిటీ లీవు (అదేనండి.. పేరెంట‌ల్ లీవ్‌) ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యింది. స్వీడ‌న్ కు చెందిన ఐకియ ఇండియా భార‌త్‌లోని త‌మ ఉద్యోగుల‌కు ఈ సౌక‌ర్యాన్ని అందించాల‌ని నిర్ణ‌యించింది. మ‌హిళా ఉద్యోగుల‌తో పాటు.. పురుష ఉద్యోగుల‌కు స‌మాన హ‌క్కులు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా పేర్కొంది. నేచుర‌ల్ డెలివ‌రీల‌కు మాత్ర‌మే కాదు.. స‌రోగ‌సీ.. ద‌త్త‌త‌లో భాగంగా పిల్ల‌ల్ని పొందిన వారికి సైతం ఈ లీవును ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది. ఐకియ బాట‌లో మిగిలిన భార‌తీయ కంపెనీలు ఎప్పుడు న‌డుస్తాయో? ఏమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/