Begin typing your search above and press return to search.
రాయలసీమకు సముద్రం వచ్చేసింది.. తిరుపతి జిల్లాపై అదిరే మీమ్
By: Tupaki Desk | 30 Jan 2022 11:00 AM ISTకొత్త జిల్లాల చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ మాటకు వస్తే.. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రోళ్లు సైతం కొత్తజిల్లాల గురించి అదే పనిగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మొత్తంగా మిగిలిన విషయాల్ని వదిలేసి.. కొత్త జిల్లాలు.. దానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా గురించి అదే పనిగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాలపై బయటకు వస్తున్న పొట్టి వీడియోలు.. మీమ్స్ కొత్త సందడిగా మారాయి. కొంత ఎటకారంతో కూడిన వీటిని చూసినప్పుడు.. కొత్త జిల్లాల పుణ్యమా అని.. కొన్ని ప్రాంతాలకు ఉండే ప్రత్యేక గుర్తింపు మిస్ అయ్యేలా చేస్తుందన్న వేదన కనిపిస్తోంది.
ఆ కోవలోకే చెందుతుంది రాయలసీమకు సముద్రం వచ్చేసిందంటూ తయారు చేసిన పొట్టి వీడియో. బుర్ర ఏమైనా పోయిందా? రాయలసీమకు సముద్రం రావటం ఏమిట్రా? అన్న సందేహం అక్కర్లేదు. కొత్త జిల్లాల పుణ్యమా అని.. రాయలసీమకు సముద్రాన్ని తెచ్చేసిన ఘనత వైఎస్ జగన్ సర్కారుకే చెల్లుతుంది. పేరుకు ఏపీ ఒకే ప్రాంతమైనప్పటికీ.. అక్కడ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఆ మాటకు వస్తే తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ.. దక్షిణ తెలంగాణ అన్న భావన ఉంటుంది. ఇప్పటికైతే పెద్దగా లేదు కానీ.. భవిష్యత్తులో ఈ అంశం ప్రధాన చర్చగా మారటమే కాదు రాజకీయ అంశంగా మార్చేందుకు కొందరు నేతలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇక.. ఏపీ విషయానికి వస్తే.. ఇప్పుడున్న పదమూడు జిల్లాల్ని తీసుకుంటే రాయలసీమ.. కోస్తా.. గోదావరి జిల్లాలు.. ఉత్తరాంధ్ర అన్న నాలుగు వేర్వేరు భిన్న రూపాల సమాహారంగా చెప్పొచ్చు. కొత్త జిల్లాల పుణ్యమా అని ఇప్పుడున్న నాలుగు ప్రాంతాల క్లియర్ కట్ తేడా.. రానున్న రోజుల్లో మారిపోనుంది. ఉదాహరణకు కొత్తగా ప్రతిపాదించిన తిరుపతి జిల్లానే తీసుకుంటే.. రాయలసీమలో భాగమైన చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణం తిరుపతి.
తాజాగా ప్రతిపాదించిన తిరుపతి కొత్త జిల్లా పుణ్యమా అని చిత్తూరు జిల్లా తిరుపతి విడిపోనుంది. అదే సమయంలో ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో భాగమైన శ్రీహరికోట.. గూడూరు.. సూళ్లూరుపేటలతో కలిసి తిరుపతి జిల్లాగా ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తిరుపతి జిల్లా వచ్చినందుకు తామెంతో హ్యాపీ అని పేర్కొంటూ.. నెల్లూరు జిల్లాకు జరిగిన నష్టాన్ని చెప్పేసిన ఈ చిట్టి వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
పోకిరి సినిమాలో మహేశ్ బాబు.. ఆశిష్ విద్యార్థి నటించిన సీన్ ను కొత్త జిల్లాకు అనుగుణంగా మార్చారు. ఇందులో మహేశ్ పాత్రను తిరుపతి జిల్లాగా.. ఆశిష్ విద్యార్థిని నెల్లూరు జిల్లాగా చూపించి.. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణగా మలిచిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో మహేశ్ ను తిరుపతి ప్రజలుగా.. ఆశిష్ విద్యార్థిని నెల్లూరు జిల్లాగా చూపించారు.
తిరుపతి పాత్రదారి .. ''ఈసారి శ్రీహరికోట నుంచి రాకెట్ మాదేరా? తిరుపతి జిల్లాదిరా.. మొత్తం మాదేరా అనంటే.. 'ఏయ్.. ఏయ్.. అది మా నుంచి దొబ్బేశార్రా.. అదింకా కన్ఫర్మ్ కాలేదురా' అంటూ ఆశిష్ విద్యార్థి బదులిస్తే.. 'రాయలసీమకు సముద్రం వచ్చింది తెలుసా? ఆ గూడూరు మాదేరా..ఆ సూళ్లూరుపేట.. ఇస్రో కూడా మాదేరా.. బీచ్ కూడా మాదేరా..మేం హ్యాపీరా.. ఇంక మా తిరుపతి జిల్లా వచ్చేసినట్లేరా.. శ్రీహరికోట మాదే.. గూడూరు మాదే..'' అంటూ మహేశ్ పాత్ర చేత చెప్పించినట్లుగా ఉన్న మాటలు చూస్తే.. కొత్త జిల్లాతో తిరుపతి ప్రజలు ఎంత ఖుషీగా ఉన్నారో చూపించారు. మరోవైపు ఇప్పటివరకు తమకు ఆభరణంగా ఉన్న ప్రాంతాలు నెల్లూరు జిల్లా వాసులు ఎలా పోగొట్టుకోనున్నారో చూశారా? అన్నట్లు ఉంది చిట్టి వీడియో. కొత్త జిల్లా పుణ్యమా అని.. రాయలసీమకు సముద్రం వచ్చేసినట్లే. కాదంటారా? మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు అందరిని తెగ ఆకర్షిస్తోంది.