Begin typing your search above and press return to search.
మీమ్స్ జోరు: నిన్న ఫేస్ బుక్.. నేడు జియో నెట్‌వర్క్ డౌన్
By: Tupaki Desk | 6 Oct 2021 3:00 PM ISTప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ లోడ్ తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. తాజాగా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా జియో నెట్ వర్క్ కు కూడా అదే పరిస్థితి ఎదురైందట.. దీంతో ఇవి అంతరాయాల రోజులు అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. వాటిపై ఆధారపడిన మిలియన్ల మంది జీవితాలను అది అస్తవ్యస్తం చేసింది. ఇది ఫేస్ బుక్ కి కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది.
ఈ ఉదయం జియో నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా ఇలాంటి అంతరాయాలను ఎదుర్కొందని సమాచారం. దీంతో నెటిజన్లు ఇప్పుడు ఏకీపారేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టించి ఎద్దేవా చేస్తున్నారు. #Jiodown అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మీడియా నివేదికల ప్రకారం, జియో నెట్‌వర్క్ ఉదయం 11 గంటలకి డౌన్ అయినట్టు తెలిసింది.
జియో వినియోగదారులు కస్టమర్ కేర్ లకు చేరుకొని తమ నెట్ వర్క్ రావడం లేదని ఫిర్యాదులు చేశారు. పెద్ద ఎత్తున కంప్లైట్లు వచ్చాయని తెలిసింది. చాలా మంది ఇంటర్నెట్ నెట్‌వర్క్ లేని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి జియో సిగ్నల్స్ రావడం లేదని గగ్గోలు పెట్టారు.
దీనికి స్పందించిన రిలయన్స్ కంపెనీ తన నెట్‌వర్క్ అంతరాయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఇలా అయినట్టు వివరణ ఇచ్చింది. తర్వాత సేవలు పునరుద్దరించింది.