Begin typing your search above and press return to search.
కేంద్ర బడ్జెట్.. మీమ్స్ హైలెట్
By: Tupaki Desk | 1 Feb 2021 11:00 PM ISTఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టి బడ్జెట్ పై అసంతృప్తులు చెలరేగిపోయారు. తమ క్రియేటివిటీని జోడించి సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపించారు. ఆశల పల్లకీలో నుంచి అగాధంలోకి తోసేసారని.. మా ఆశల మీద నీళ్లు చల్లారంటూ బోలెడన్నీ మీమ్స్ ను తయారు చేసి సోషల్ మీడియాలో నింపేశారు.ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ లో ఏం చేయలేదని.. వారి నడ్డి విరిచారని మీమ్స్ పోటెత్తాయి. కరోనా కల్లోలంలో ఈ బడ్జెట్ ఆదుకోలేదని సామాన్యుల నుంచి మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ సెటైర్లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
చాలా మంది సృజనశీలురు నిర్మలమ్మ బడ్జెట్ పై సెటైర్లు కురిపించారు. ఒకరేమో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పరేషాన్ తో చూస్తున్న ఫొటోను షేర్ చేయగా.. మరికొందరు సెలబ్రెటీలు ఆశ్చర్యపోయినట్టు మీమ్స్ వదిలారు. ఇక రాహుల్ గాంధీ తలపట్టుకున్న ఫొటోను కొందరు మీమ్ గా తయారు చేశారు.ఇక ఇంకొందరు కౌన్ బనేగాలో అమితాబ్ ప్రశ్నించిన మీమ్ ను బడ్జెట్ పై సెటైర్ గా సంధించారు.