Begin typing your search above and press return to search.

ఇవాంకను చూసి మొఖం తిప్పుకున్న మెలానియా .,.వీడియో వైరల్

By:  Tupaki Desk   |   28 Aug 2020 2:30 PM GMT
ఇవాంకను చూసి మొఖం తిప్పుకున్న మెలానియా .,.వీడియో వైరల్
X
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధినేత డొనాల్డ్‌ ట్రంప్ పెద్ద కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌ ల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్‌ నేషనల్‌ కన్వెన్షన్ చివరి రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండో సారి ట్రంప్‌ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె ఇవాంక, ట్రంప్‌ ను పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియా‌తో కలిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇవాంక ట్రంప్ తన తండ్రిని, మెలానియాను నవ్వుతూ విష్‌ చేశారు. బదులుగా ప్రథమ మహిళ కూడా నవ్వుతు కనిపించింది. కానీ , సెకన్ల వ్యవధిలోనే ఇవాంకను చూసి మొఖం కవళికలు పూర్తిగా మార్చేశారు. ఇవాంక అక్కడ నుంచి వెళ్లగానే ప్రథమ మహిళ ముఖం చిట్లించుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు సెకన్ల వీడియో ఎంతగా వైరలవుతుందంటే.. ఇప్పటికే దీన్ని 5 మిలియన్ల మంది చూసేసారు. ఇప్పిటికే ఇవాంకకు, మెలానియా ట్రంప్‌ కు పడటం లేదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో మెలానియా తన స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్ స్టన్ వాకాఫ్ రాసిన పుస్తకంలో మెలానియా ట్రంప్ తన సవతి కుమార్తె అయిన ఇవాంక ట్రంప్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రస్తావించారని ఆ దేశ మీడియా రిపోర్టర్ యాషర్ ఆలీ తెలిపారు.

దీనికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లను సైతం చేశారు. ‘మెలానియా అండ్ మీ’:ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ మై ఫ్రెండ్ షిప్ విత్ ఫస్ట్ లేడీ’ అనే పుస్తకంలో మెలానియా తన సవతి పిల్లల గురించి ముఖ్యంగా ఇవాంక తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లుగా రాశారని సమాచారం. మెలానియా ట్రంప్‌ కు తెలియకుండా ఆమె స్నేహితురాలు స్టెఫానీ విన్ స్టన్.. మెలానియా వ్యాఖ్యలను రికార్డు చేసినట్లుగా రిపోర్టర్ యాషర్ ఆలీ తెలిపారు.