Begin typing your search above and press return to search.
పాడు దగ్గు మెలానియాకు అరుదైన అవకాశాన్ని దెబ్బ తీసిందట
By: Tupaki Desk | 21 Oct 2020 6:40 PM ISTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన నోరు విప్పితేచాలు ఏదో ఒక సంచలనం. ఆయన తీరుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్. కారణం ఏమైనా.. ట్రంప్ పదవీ కాలంలో కొన్నిసార్లు మాత్రమే వార్తల్లోకి వచ్చారుతప్పించి.. అట్టే వార్తల్లోకి రాలేదు. ఆమె తీరుపై ఒక్క విమర్శ కూడా రాలేదు. తన పరిమితుల్లో తాను ఉండటమే కాదు.. సాధారణంగా అధ్యక్షుల వారితో వారి సతీమణులు పాల్గొనే కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నది లేదు.
ఇటీవల భర్త ట్రంప్ తో పాటు కరోనా బారిన పడిన మెలానియా.. తాజాగా ఒక అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్నట్లుగా చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆమె తీవ్రమైన దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా భర్తతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని ఆమె వదులుకున్నట్లుగా తెలుస్తుంది.
కరోనా ఇబ్బందుల నుంచి బయటకు వచ్చినా.. ఎడతెగని రీతిలో ఇబ్బందిపడుతున్న దగ్గుతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారట. దీంతో.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రయాణాల్ని వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విపరీతమైన దగ్గు కారణంగా పెన్సిల్వేనియాలో జరిగే ర్యాలీకి వెళ్లటం లేదట. 2019 నుంచి ఇప్పటివరకుభర్త ట్రంప్ తో కలిసి ఏ వేదికను మెలానియా పంచుకోకపోవటం గమనార్హం.