Begin typing your search above and press return to search.

అదృష్టం అంటే మెలానియానాదేనా?

By:  Tupaki Desk   |   11 Nov 2016 3:48 AM GMT
అదృష్టం అంటే మెలానియానాదేనా?
X
వైట్ హౌస్ లో అడుగుపెట్టి ట్రంపే కాదు.. ఆయన భార్య కూడా రికార్డులు సృష్టించారు. సూపర్ మోడల్ గా అందరికీ తెలిసిన మెలానియా ట్రంప్ ప్రచారంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ట్రంప్ కష్టాల్లో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగి ఆదుకుని ఇప్పుడు శ్వేతసౌధంలో ఫస్ట్ లేడీగా అడుగుపెట్టబోతున్న మెలానియా.. రెండో విదేశీ ప్రథమ మహిళగా రికార్డు కొట్టేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు జాన్స్ క్విన్సీ భార్య లూసియా మొదటి ప్రథమ విదేశీ మహిళగా గుర్తింపు పొందింది.

యుగోస్లేవియాలో కమ్యునిస్ట్ పార్టీలో సభ్యుడైన ఒక వ్యక్తికి జన్మించింది మొలానియా. వారిది మద్యతరగతి కుటుంబం - చిన్నప్పటి నుంచీ చిన్న ఇంట్లోనే ఉండే అలవాటు. అలా మధ్యతరగతి సంపాదనతోనే సెకండరీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఫొటోగ్రఫీ చదువుకుని - అనంతరం యూనివర్శిటీలో చేరింది. కాలేజీ రోజుల నుంచి ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్లు చదవడం ఆమెకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పదహారేళ్ల ప్రాయంలోనే మోడలింగ్‌ కెరీర్‌ ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో 1998లో న్యూయార్క్‌ సిటీలో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌ లో పాల్గొనడంతో ట్రంప్‌ ను కలిసే అవకాశం వచ్చింది. అలా ఏర్పడిన వీరి పరిచయం మెల్లగా డేటింగ్‌ అనంతరం పెళ్లి వరకు వెళ్లింది. వీరి మధ్య వయోవ్యత్యాసం ఎక్కువున్నా సరే మానసికంగా వీరు దగ్గరవ్వడానికి అది ఆటంకం కాలేదు. ఫలితంగా 2005లో వీరిద్దరికీ పెళ్లి అయ్యింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటినుంచీ ఈమె మాటల దాడులుపెరిగిపోయాయి. నగ్నంగా పోజులిచ్చిన ఒక మహిళ అమెరికా ప్రథమ పౌరురాలు అవుతుందా? అంటూ ట్విటర్‌ - ఫేస్‌ బుక్‌ లతోపాటు బహిరంగసభల్లోను ట్రంప్‌ భార్య మెలానియాను దుమ్మెత్తిపోశారు డెమోక్రాట్లు. అయినా మెలానియా అధైర్యపడలేదు.. అదంతా కేవలం మోడలింగ్‌ వృత్తిలో భాగంగా చేశాననుకుని.. ఆ విషయాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. దీంతో నైతికంగా దిగజార్చడం కోసం ఆ అంశాన్ని ప్రత్యర్థులు వాడుకున్నట్లు విమర్శలు వచ్చాయి.

ఇలాంటి ఎన్నో విమర్శలు తన జీవితంలో ఎదుర్కొని, చిన్ననాటి నుంచీ ఎన్నో కష్టాలను చవిచూసిన ఓ సూపర్ మోడల్.. ఫస్ట్ లేడీ కావడం అమెరికాలో చాలా ప్రత్యేకం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/