Begin typing your search above and press return to search.

మెలానియాతో రాజీ చేసుకున్న మీడియా సంస్థ‌

By:  Tupaki Desk   |   12 April 2017 4:57 PM GMT
మెలానియాతో రాజీ చేసుకున్న మీడియా సంస్థ‌
X
మీడియా సంస్థ‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాన్ని.. తొంద‌ర‌ప‌డి అవాకులు చ‌వాకులు పేల‌కూడ‌ద‌న్న స‌త్యాన్ని తాజా ఉదంతం తేల్చి చెప్పింద‌ని చెప్పాలి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు పోటాపోటీగా సాగిన వేళ‌.. ట్రంప్ స‌తీమ‌ణి.. మాజీ మోడ‌ల్ మెలానియాపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ మీడియా సంస్థ తాజాగా సారీ చెప్ప‌ట‌మే కాదు..గ‌తంలో ఆమెపై తాము చేసిన వ్యాఖ్య‌ల‌పై విచారాన్నివ్య‌క్తం చేశాయి. అంతేకాదు.. భారీ మూల్యాన్ని న‌ష్ట‌ప‌రిహారంగా ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా గ‌తంలో మోడ‌ల్ గా ప‌ని చేసే స‌మ‌యంలోనే వ్య‌భిచార వృత్తిలో కూడా ఆరోపిస్తూ ప్ర‌ముఖ మీడియా సంస్థ డెయిలీ మొయిల్ ప‌త్రిక‌.. మొయిల్ ఆన్ లైన్ వెబ్ సైట్లు ఒక వివాదాస్ప‌ద క‌థ‌నాన్ని ప్ర‌చురించాయి. దీనిపై మెలానియా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని వాపోయింది. అంతేకాదు.. త‌న ప‌రువుప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బ తీసేలా అచ్చేసిన ఈ క‌థ‌నంపై వెయ్యి కోట్ల రూపాయిల ప‌రువున‌ష్టం దావా కేసును వేసింది.

అప్ప‌ట్లో స‌ద‌రు మీడియా సంస్థ బింకంగా ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా మాత్రం తాము త‌ప్పు చేశామ‌ని.. తాము చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని తేల్చి చెప్పింది. జ‌రిగిన త‌ప్పున‌కు చెంప‌లేసుకోవ‌ట‌మేకాదు..భేష‌ర‌తుక్ష‌మాప‌ణ‌లు చెప్పింది. గ‌తంలో ప్ర‌చురించిన క‌థ‌నాన్ని తీసివేసింది. ఈ వివాదం విష‌యంలో మెలానియాతో రాజీ కుదుర్చుకున్న‌ట్లుగా తాజాగా ఒక ప్ర‌క‌ట‌న‌లో డెయిలీ మొయిల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించినందుకు తాము విచారిస్తున్నామ‌ని.. మ‌రోసారి ఆమెకు సారీ చెబుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. 1990ల‌లో ఆమె మోడ‌ల్ గా ప‌ని చేసే స‌మ‌యంలో వ్య‌భిచార వృత్తిలో (ఎస్కార్ట్స్‌) ఉన్నార‌ని.. ఆమె ప‌ని చేసిన మోడ‌లింగ్ ఏజెన్సీ నిర్వాహ‌కుడే త‌మ‌కు ఆ విష‌యాన్ని చెప్పిన‌ట్లుగా గ‌త ఆగ‌స్టులో ప్ర‌చురించిన క‌థ‌నంలో పేర్కొన్నారు. అయితే.. అందులో నిజం లేద‌ని.. త‌ప్పు జ‌రిగింద‌ని పేర్కొంటూ ప‌రువున‌ష్టం దావా విర‌మించుకునేందుకు వీలుగా మెలానియాతో రాజీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సారీతో పాటు రూ.19కోట్ల మొత్తాన్ని ఇష్యూను సెటిల్ చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అంత‌కు మించే న‌ష్ట‌ప‌రిహారాన్ని స‌ద‌రు మీడియా సంస్థ చెల్లించి ఉంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఏమైనా తాజా ఉదంతం మెలానియా మ‌నోవ్య‌ధ‌ను కొంత‌మేర త‌గ్గిస్తుంద‌నటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/