Begin typing your search above and press return to search.

ఎన్పీ కుంట 'మేఘా' పవర్ గ్రిడ్ కు లిమ్కా రికార్డ్

By:  Tupaki Desk   |   11 March 2019 5:43 AM GMT
ఎన్పీ కుంట మేఘా పవర్ గ్రిడ్ కు లిమ్కా రికార్డ్
X
దేశంలోనే అతితక్కువ సమయంలో పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్ ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతిష్ఠాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా ఏషియా - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నూ సాధించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నంబులపూల కుంట (ఎన్పీ కుంట) వద్ద ఎంఈఐఎల్ 400/220 కేవీ పవర్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. 12 నెలల్లో పూర్తి చేయాల్సిన సబ్ స్టేషన్ ను కేవలం ఏడు నెలల్లో పూర్తి చేయడం - నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండటంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఈ వివరాలను తన వెబ్ సైట్ లో ప్రచురించింది. అంతేకాకుండా పీజీసీఐఎల్ నుంచి ప్రతిష్ఠాత్మక బెస్ట్ డెబ్యుటెంట్ అవార్డ్ ను - మెమెంటో తోపాటు ప్రశంసా పత్రాన్ని ఎంఈఐఎల్ దక్కించుకుంది.

మూడేళ్లుగా నిరాటంకంగా విద్యుత్ సరఫరా:

సాధారణంగా ఒక విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం పడుతుంది. అయితే మేఘా ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టు పనులను 25 సెప్టెంబర్ 2015న ప్రారంభించి కేవలం ఏడు నెలల్లోనే అంటే 25 ఏప్రిల్ 2016న ప్రారంభోత్సవం చేసింది. క్లిష్టమైన నమూనాలు - కఠినమైన నిబంధనలు - ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేని - వర్షాలు కురుస్తున్న ఈ ప్రాంతంలో గడువుకన్నా ముందే ‘మేఘా’ సబ్ స్టేషన్ పనులను పూర్తిచేసింది. గత మూడేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఆల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ ను పవర్ గ్రిడ్ కు అనుసంధానించడం కోసం ఎన్పీ కుంట సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఆల్ట్రా మెగా సోలార్ ప్లాంట్ నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఈ సబ్ స్టేషన్ ప్రాజెక్టును చేపట్టారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్.. 500 ఎంవీఏ - 400/200 కేవీ మూడు ఆటో ట్రాన్స్ ఫార్మర్లు - 125 ఎంవీఏఆర్ ఒక బస్ రియాక్టర్ ను నిర్మించింది. 400 కేవీ 100 ఏవీఏఆర్ స్టేషన్ ఒకటి - 400 కేవీ బేస్ లైన్లు రెండు - 400 కేవీ టైబేస్ లు నాలుగు - 220 కేవీ లైన్ బేస్ లు నాలుగు - 220 కేవీ బస్ కప్ లార్ బే ఒకటి - ఒక 220 కేవీ ట్రాన్స్ ఫార్మర్ బస్ కప్ లార్ బేను ఏర్పాటు చేసింది. అలాగే సివిల్ పనులైన డ్రైన్ - రహదారులు - కల్వర్టులు - కంట్రోల్ రూమ్ - బే క్యూస్క్ - ట్రాన్సిట్ క్యాంపు - ఫైర్ ఫైటింగ్ - పంప్ హౌజ్ నిర్మాణాలను మేఘా పూర్తి చేసింది.