Begin typing your search above and press return to search.

ఏడాదిలో ‘మేఘా’ 70 ప్రాజెక్ట్ ల పూర్తి

By:  Tupaki Desk   |   29 May 2018 11:43 AM GMT
ఏడాదిలో ‘మేఘా’ 70  ప్రాజెక్ట్ ల పూర్తి
X
ఇన్ ఫ్రా రంగంలో వివిధ ప్రాజెక్టులు పూర్తిచేయటంలో మేఘా ఇంజనీరింగ్ తనదైన ముద్రను సంపాదించుకుంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో గడిచిన పనుల సంవత్సర (వర్క్ ఇయర్) కాలంలో (2017 ఏప్రిల్ నుండి 2018 ఏప్రిల్ వరకు) 70 ప్రాజెక్ట్ లను పూర్తిచేసి తన సత్తాను చాటుకుంది. ప్రస్తుతం దేశంలో మరే ఇన్ ఫ్రా సంస్థ కూడా పూర్తి చేయని విధంగా ఎంఈఐఎల్ భారీ సంఖ్యలో ప్రాజెక్ట్లను పూర్తిచేసి ప్రభుత్వాలకు అప్పగించినట్లు ‘బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా’ సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రైవేట్ లీ ఓన్డ్ హై పర్ఫార్మర్స్ (అన్ లిస్టెడ్ కంపెనీలు)లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ (ఇన్ ఫ్రా రంగంలో) మొదటి స్థానంలో ఉన్నట్లు బిజినెస్ స్టాండర్డ్ వార్షిక నివేదిక (బిఎస్-1000)లో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం అన్ లిస్టెడ్ రంగంలో నాణ్యత ప్రమాణాల్లో మేఘా 4వ స్థానంలో ఉండగా మిగిలిన ప్రముఖ సంస్థలు వెనుకబడి ఉన్నాయి. అయితే ఇన్ ఫ్రా రంగంలో మాత్రం మేఘా మొదటి స్థానంలో ఉంది.

ఇప్పటికే మేఘా అనేక రికార్డులను సాధించింది. దేశంలో మొట్టమొదటిసారిగా గడువు పొడగించకుండానే నిర్ణీత సమయంలో పట్టిసీమ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. గడువుకన్నా ముందే ఎన్ పి కుంట పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్ ను పూర్తి చేసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి అభినందనలు అందుకుంది. ఆసియాలోనే పెద్దదైన రాంతల్ డ్రిప్ ఇరిగేషన్ ను కర్నాటకలో జాతికి అంకితం చేసింది. జాతీయ స్థాయిలో ప్రైవేటు రంగంలో పెద్దదైన పవర్ గ్రిడ్ (డఋ్య్లపీపీటీసిఎల్)ను ఉత్తరప్రదేశ్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసింది. ఇందులో గ్యాస్ ఆధారిత సబ్ స్టేషన్ ను తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది. తెలంగాణాలో గజ్వేల్ వాటర్గ్రిడ్ను గడువుకన్నా ముందే పూర్తిచేసి సత్తా చాటుకుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మేఘా ఇంజనీరింగ్ హైదరాబాద్ కేంద్రంగా దేశ - విదేశాల్లో పనులు చేపడుతూ ప్రభుత్వం అప్పగించిన పనులను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. దేశంలో ఏ గ్రేడ్ కంపెనీలైన ఎల్ అండ్ టి లాంటి సంస్థల సరసన మేఘా చేరింది. అయితే అన్ లిస్టెడ్ లో మేఘా మొదటిస్థాయికి చేరుకుంది.

తాగునీరు - సాగునీరు - విద్యుత్ - హైడ్రోకార్బన్స్ - రహదారులు - రవాణా తదితర రంగాలలో గడువు కంటే ముందుగానే పనులు పూర్తి చేసింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్నాటక - తమిళనాడు - మహారాష్ట్ర - గుజరాత్ - రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ - హిమాచల్ ప్రదేశ్ - ఒడిస్సా - మధ్యప్రదేశ్ - అస్సోం - చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల్లో ఆయా రంగాల్లో ప్రభుత్వ ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసింది.

వివిధ రంగాల్లో గుజరాత్లో సర్దార్ సరోవర్ నిగమ్ లిమిటెడ్ కింద వివిధ ప్యాకేజీల్లో భాగంగా కేబీసీ లిఫ్ట్ ఫేస్-3 - దమన్ - ఆంధ్రప్రదేశ్ లోని పురుషోత్తపట్నం - ముచ్చుమర్రి - సిద్ధాపురం - పులికనుమ - కండలేరు - కర్నాటకలోని చామ్ రాజ్ నగర్ - హుళ్లహల్లి - గుండ్లుపేట్ - కియోంజిహార్ - తెలంగాణలో 16 తాగునీటి పథకాలను (వాటర్ గ్రిడ్ తో సహా) పూర్తి చేసింది. దేవాదుల పథకం కింద ఫేజ్-3 లోని ప్యాకేజ్ లో-4 - ధర్మసాగర్ - గండిరామారం - బొమ్మకూరు పథకాలను - విద్యుత్ రంగంలో ఉత్తరప్రదేశ్ లో డఋ్ల్యపీపీటీసీఎల్ - ఎన్ పి కుంట - మహేశ్వరం - నర్సాపూర్ - కలికిరి సబ్ స్టేషన్లను - జామ్నగర్-జెట్పూర్ విద్యుత్ సరఫరా మార్గాన్ని - బేతంచర్ల - తాడిపత్రి విద్యుత్ సరఫరా లైన్లను పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద అతిపెద్దదైన ప్యాకేజ్-8 పంపింగ్ స్టేషన్ కు అవసరమైన విద్యుత్ను అందించే రామడుగు 400 కెవి సబ్ స్టేషన్ ను సకాలంలో నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తొలి విద్యుత్ ప్రాజెక్ట్ ను పూర్తిచేసిన ఘనత మేఘా దక్కించుకుంది.

పశ్చిమ ఉత్తరప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (డఋ్ల్యపీపీటీసిఎల్) మరో ప్రత్యేకతను సంతరించుకుంది. విద్యుత్ సరఫరాలో అత్యుత్తమ సంస్థగా కేంద్రప్రభుత్వంలోని విద్యుత్ శాఖ ఆధీనంలో సరఫరాను పర్యవేక్షించే ‘తరంగ్’సంస్థ నుంచి గుర్తింపు పొందింది. 1500 ఎంవీఏ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ను సరఫరా చేయడం ద్వారా ఈ ప్రత్యేకత సాధ్యమైంది. మొత్తం మీద 13220 ఎంవీ సరఫర సామర్థ్యంతో 4వేల మెగావాట్ల విద్యుత్ ను డఋ్ల్యపీపీటీసిఎల్ అందిస్తోంది. మేఘాకు చెందిన డఋ్ల్యపీపీటీసిఎల్ విద్యుత్ సరఫరాలో పవర్ గ్రిడ్ తెలంగాణ - తమిళనాడు - రాజస్థాన్ రాష్ట్రాలలో పవర్ ట్రాన్స్ మిషన్ కంపెనీలను అధిగమించింది.

హైడ్రోకార్బన్స్ రంగంలో ఇంటింటికీ గ్యాస్ను అందించే పథకాన్ని కృష్ణా జిల్లా - కర్నాటకలోని తూంకూరు - బెల్గాం జిల్లాల్లో పూర్తి చేసింది. అదే విధంగా అస్సోంలోనూ - తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కెశనపల్లి - తదితర ప్రాజెక్ట్ లను ఈ రంగంలో నిర్మించి ఘనత చాటుకుంది.

తాగునీటి రంగంలో ఆసియాలోనే అతిపెద్దదైన నీటిశుద్ధి ప్లాంట్లను హైదరాబాద్ (గోదావరి నీటి సరఫరా) - వాటర్ గ్రిడ్ లోని మహబూబ్ నగర్ - కరీంనగర్ - నిజామాబాద్ - మెదక్ తదితర జిల్లాలో గరిష్టంగా 145 ఎంఎల్ డి సామర్థ్యంతో నిర్మించి సకాలంలో జాతికి అంకితం చేసింది. తాగునీటి సరఫరాలకు అవసరమైన పైప్ లైన్లను పూర్తి చేయడంలో కూడా ప్రత్యేకత సంతరించుకుంది. దాదాపు 25వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్లను పూర్తిచేయడం ద్వారా వాటర్ గ్రిడ్ నిర్మాణం తనదైన ముద్రను వేసుకుంది. మేఘా ఇంజనీరింగ్ నిర్మాణ పనులను పోటీ పడి దక్కించుకోవడమే కాకుండా సకాలంలో నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తిచేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది.