Begin typing your search above and press return to search.

కరోనా పోరులో భాగమైన మేఘా..రూ. 5 కోట్ల విరాళం!

By:  Tupaki Desk   |   26 March 2020 12:08 PM GMT
కరోనా పోరులో భాగమైన మేఘా..రూ. 5 కోట్ల విరాళం!
X
ప్రపంచాన్ని కబళించేందుకు తరుముకొస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో దేశంలో నిషేధాజ్ఞలు విధించాయి. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టాలని భారత ప్రభుత్వం 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ ప్రకటించింది. కరోనా పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రా ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలు, కార్యక్రమాలకు చాలా డబ్బు ఖర్చవుతుంది. దీనితో, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలకు తమ వంతు సాయం కొందరు ప్రముఖులు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ - ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది. లాక్ డౌన్ తో పనిలేక ఆకలితో అల్లాడుతున్న పేదలతో పాటుగా - కరోనా మహమ్మారి తరిమివేయడానికి 24 గంటలు పనిచేస్తున్న పోలీసులకు - ఆరోగ్య సిబ్బందికి - మీడియా వాళ్లకు ఈరోజు రాత్రి నుంచి హైదరాబాద్ లో భోజన సదుపాయం కల్పించడానికి సిద్ధమైంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు బాధ్యతగా రూ. 5 కోట్లను విరాళాన్ని అందించింది. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేఘ సంస్థ ప్రశంసించింది. ప్రభుత్వం - ముఖ్యమంత్రి శక్తీ సామర్ధ్యాలపై ప్రజలకు వున్నా విశ్వాసాన్ని మేఘ యాజమాన్యం అభినందించింది. 5 కోట్ల రూపాయలకు చెక్కును ముఖ్యమంత్రి కి అందచేస్తూ.. ఈమేరకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కు మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి ఒక లేఖ రాశారు.

ఇప్పటివరకు ఎన్నో వైరస్ లని దైర్యంగా ఎదుర్కొన్న ప్రపంచం ..ఈ కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి అష్టకష్టాలు పడుతుంది. ఈ వైరస్ బయట పడి నెలలు గడుస్తున్నా కూడా ..దీనికి ఇప్పటివరకు సరైన మందు లేకపోవడంతో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ ని అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనితో ప్రభుత్వానికి మద్దతుగా పలు సంస్థలు - ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతు భాద్యతగా విరాళాలని - కావాల్సిన సౌకర్యాలని అందిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుమప నాదెళ్ల సీఎం సహాయ నిధికి ఆమె రూ.2 కోట్ల బూరి విరాళం ప్రకటించారు. అలాగే క‌రోనాపై పోరాటానికి ఆనంద్ మహీంద్రా తన 100 శాతం శాలరీని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే అయన సంస్థలో అధునాతన వెంటిలేటర్లని తయారుచేస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడే మనిషి నేనున్నా అంటూ తోడు నిలబడతాడు అన్నటుగా ....ఈ కరోనా నుండి దేశాన్ని కాపాడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ప్రభుత్వానికి సాయంగా నిలుస్తున్నారు. వీరిని చూసి మరింత మంది ముందుకు వస్తే .. ప్రభుత్వం ఈ కరోనాని అరికట్టడానికి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా 21 రోజుల పాటు ఇంట్లోనే ఉంటే ...ఈ కరోనా విపత్తు నుండి తప్పించుకునే ఆస్కారం ఉంది.