Begin typing your search above and press return to search.
'హలో శంకర్ ఎలా ఉన్నారు'...ఎమ్మెల్యేకి చిరంజీవి ఫోన్ !
By: Tupaki Desk | 5 Jun 2021 5:21 PM ISTకరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సినీ స్టార్ రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకి తోచినంతగా సహాయం చేస్తూ తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరోలమే అని నిరూపిస్తున్నారు. ముఖ్యంగా సోనూసూద్ కరోనా సమయంలో దేశానికి వెన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా వేళ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైన చోటకు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు పంపి ఎంతోమంది ప్రాణాలు నిలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను పంపించారు. ఈ సందర్భంగా చిరంజీవి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడి , అయన ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలని సలహా ఇస్తూ , ప్రజలకి చేస్తున్న సేవ పై ప్రశంసలు కురిపించారు.
మానుకోట తన అభిమాన కోట అంటూ మెగాస్టార్ ఎమ్మెల్యేతో మాట్లాడారు. మానుకోటలో ఎంతో మంది తనకు అభిమానులు ఉండటం సంతోషించదగ్గ విషయమని, మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లను పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు. హలో శంకర్ ఎలా ఉన్నారు. కుటుంబ సభ్యులు బాగున్నారా, ప్రజల్లో బాగా తిరుగుతారు, పరిస్థితులు అసలే బాగాలేవు ప్రజలకు బాగా ఉపయోగపడే వ్యక్తి మీరు, మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఎమ్మెల్యేతో చిరు మాట్లాడారు. తగు జాగ్రత్తలు తీసుకోండి, ప్రజల్లో బాగా గుర్తింపు పొందారు అంటూ సంభాషణ సాగించారు. తాము కోరిన వెంటనే జిల్లాకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లు అందించినందుకు చిరంజీవికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.