Begin typing your search above and press return to search.

నాగబాబు నోట టీడీపీ మాట

By:  Tupaki Desk   |   18 Dec 2022 9:03 PM IST
నాగబాబు నోట టీడీపీ మాట
X
మెగా బ్రదర్ నాగబాబు బోల్డ్ గా మాట్లాడేస్తారు. ఆయన మాటలలో అంతా అలా దూకుడుగా బయటకు వచ్చేస్తుంది తప్ప వ్యూహం ప్రకారం మాట్లాడుతున్నారు అని అనుకోలేరు. అది ఆయన వైఖరి. ఆయన రాజకీయ నాయకుడు కంటే నటుడుగానే ఎక్కువ అనుభవశాలి కాబట్టి ఎక్కడ ఏది దాచాలి, ఏది చెప్పాలీ అన్నవి ఆయన ముందే ప్రిపేర్ అయి ఉండలేరు.

ఇదిలా ఉంటే నాగబాబు తాజగా తన తమ్ముడు పేరు మీద వచ్చిన రియల్ యోగి పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ పదవులు కావల్సివస్తే తెలుగుదేశం బీజపీలో చేరితే పవన్ కి వచ్చేవి అని అనేశారు. బీజేపీ వరకూ ఒకే. ఎందుకంటే ఆ పార్టీ జనసేనకు మిత్రపక్షంగా ఉంది. తెలుగుదేశం విషయమే ఇప్పటిదాకా ఎటూ తేలడంలేదు.

తెలుగుదేశం పార్టీతో కటీఫ్ అని 2017లో పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక రీసెంట్ గా చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ ని విజయవాడ హొటలో కలిశారు. అదొక్కటే రెండు పార్టీల మధ్య జరిగిన భేటీ తప్ప అంతకు మించి పురోగతి ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే జనసేన పొత్తులు పెట్టుకుంటుంది అని వైసీపీ అయితే విపరీతంగా ప్రచారం చేస్తూ వస్తోంది.

అదే టైం లో టీడీపీ కోసమే జనసేన ఉందని, చంద్రబాబుని   ముఖ్యమంత్రి చేయడం కోసమే పవన్ రాజకీయం అని కూడా వైసీపీ నేతలు సందర్భం వచ్చినపుడల్లా విమర్శలు చేస్తూ వస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం విషయంలో ఈ రోజుకీ తన స్టాండ్ ఏంటి అన్నది చెప్పలేదు. ఆయన వ్యూహాత్మకంగానే ఎడం పాటిస్తున్నారు.

తనకే ఓటు వేయమనే జనాలకు చెబుతూ వస్తున్నారు. అంత జాగ్రత్తగా జనసేన వ్యవహారాలను రాజకీయాలను నడుపుతున్న వేళ నాగబాబు పుసుక్కున తెలుగుదేశంలో చేరితే మంత్రి అయ్యేవారు అని అనడం మాత్రం ఇపుడు చర్చకు తావిస్తోంది.అంటే పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశంతో మంచి రిలేషన్స్ ఉన్నాయని గట్టిగా చెప్పేలా నాగబాబు తాజా కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ విధంగా జనసేనను మెగా బ్రదర్ కొంత ఇబ్బంది పెట్టారనే అంటున్నారు.

మరో వైపు చూస్తే  వచ్చే ఎన్నికల్లో  గెలిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని, జనసేనతో పొత్తు ఉంటే పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా సాగుతోంది. ఇపుడు పవన్ కళ్యాణ్ మంత్రి పదవి వద్దు అనే రాజకీయం చేస్తున్నారు అని నాగబాబు ముందే చెప్పేశారు. రేపటి రోజున రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు. అపుడు కనుక పవన్ మంత్రి పదవి తీసుకుంటే నాగబాబు కామెంట్స్ జనసేనకు పవన్ కళ్యాణ్ కి చుట్టుకునే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు.

రాజకీయాల్లో ఉన్నవారు ప్రతీ మాటా ఆచీ తూచీ వాడాలంటారు. నాగబాబు జనసేనలో ఉన్నారు. పైగా ఎంపీగా పోటీ చేశారు. ఆయన బోల్డ్ గా మాట్లాడినా ఆ ప్రభావం కచ్చితంగా పార్టీ మీద ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు తన మాటలలో టీడీపీని తీసుకురావడం ద్వారా ఆ పార్టీతో జనసేనకు సన్నిహితత్వం ఉంది అని అనుమానించేలా చేశారని మాత్రం అంటున్నారు.