Begin typing your search above and press return to search.

మీడియాలో పెద్దగా ఫోకస్ కాని మీటింగ్ ఒకటి శ్రీనగర్ లో జరిగింది తెలుసా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:30 AM GMT
మీడియాలో పెద్దగా ఫోకస్ కాని మీటింగ్ ఒకటి శ్రీనగర్ లో జరిగింది తెలుసా?
X
నిజానికి దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపే కొన్ని అంశాలు ఇటీవల కాలంలో ప్రధాన మీడియాలో పెద్దగా కనిపించని పరిస్థితి. ఇప్పుడు అలాంటి సమావేశం ఒకటి కశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ పట్టణంలో జరిగింది. చరిత్రలో జరిగిన ఘోరమైన తప్పును సరిదిద్దేందుకు వీలుగా తాజా సమావేశం జరిగినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమావేశానికి లౌకికవాదాన్ని.. స్వేచ్ఛా ప్రియత్వ సుద్దులు చెప్పే వారెవరు రాలేదు. ఇంతకీ ఈ సమావేశం స్పెషల్ ఏమంటే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలు.. కశ్మీరీ పండిట్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అప్పట్లో కశ్మీర్ లోయ నుంచి పండిట్లనను లక్షలాదిగా తరిమేసిన వైనం.. భయం గుప్పిట్లో కశ్మీర్ వ్యాలీని వదిలేసి.. బతుకు జీవుడా అనుకుంటూ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన వైనం తెలిసిందే. చిన్న ఉదంతాలకే పెద్ద ఎత్తున విరుచుకుపడే ప్రజాస్వామ్య వాదులు.. లౌకిక జీవులు.. కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ దారుణం మీద పెద్దగా స్పందించింది లేదు.

దశాబ్దాల క్రితం చరిత్రలో జరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇంతకాలం జరగనప్పటికీ..తాజాగా మాత్రం అందుకు భిన్నమైన సీన్ ఒకటి శ్రీనగర్ లో చోటు చేసుకుంది. మతాలకు అతీతంగా కలిసి జీవించే సంప్రదాయానికి గుర్తుగా.. గత వైభవానికి ఏకం కావాలన్న పేరుతో కశ్మీర్ లోని మేధావులు.. విద్యావేత్తలు తాజాగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా శ్రీనగర్లో వారంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీలు.. కశ్మీరీ పండిట్లు హాజరయ్యారు.

పండిట్లు.. ముస్లింలు ఒకే ప్రాంతానికి చెందిన వారు.. మళ్లీ కలిసి జీవించే రోజులు వస్తాయన్న వాదనను వినిపించారు. నిజానికి అలాంటిది జరిగితే అంతకు మించి కావాల్సిందేముంది? కానీ.. ఇలాంటి వాటి కోసం ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి సాదరంగాఆహ్వానిస్తే భారత్ లోని భిన్నత్వంలోని ఏకత్వం ఆవిష్క్రతం కావటం ఖాయం. మరి.. అలాంటి సీన్ ఎప్పటికి సాధ్యం? ఇప్పటికైతే ఒక అడుగు పడింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కశ్శీర్ వ్యాలీలో ఉన్న మెజార్టీలు అయిన ముస్లింలే చేయాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఆ పని చేస్తారా? వెళ్లిపోయిన కశ్మీరీ పండిట్లు తమ సొంత ఊళ్లకు.. సొంత ఇళ్లకు చేరుకోగలుగుతారా? అదే జరిగితే.. అంతకు మించిన అద్భుతం మరొకటి ఉండదనే చెప్పాలి.