Begin typing your search above and press return to search.
సెక్స్ వర్కర్ కూతురు సెలబ్రిటీ అయ్యింది!
By: Tupaki Desk | 23 Sept 2020 5:20 PM ISTతల్లి ఓ సెక్స్‌వర్కర్.. తండ్రి ఎప్పుడో పోయాడు.. మారు తండ్రి పెంపకంలో పెరిగింది ఆ చిన్నారి. తన చుట్టూ వ్యభిచార గృహాలే. తాను ఉండే ఇళ్లు కూడా ఓ వ్యభిచార కూపమే. తన అమ్మ, అమ్మమ్మ, పూర్వీకుల లంతా ఇటువంటి పనులు చేసేవాళ్లే.. అయితే ఇటువంటి దారుణమైన సామాజిక పరిస్థితుల్లోనుంచి ఓ బాలిక బయటకు వచ్చేసింది. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో చదువుకున్నది. ఏకంగా అమెరికా వెళ్లి అక్కడ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. అంతేకాక పలు అంతర్జాతీయ వేదికల్లో స్త్రీల సమస్యలు, జాతి వివక్షత గురించి అనర్గలంగా మాట్లాడుతోంది. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఏ సామాజిక పరిస్థితులు, ఏ కట్టుబాట్లు మనల్ని ఆపలేవని నిరూపించింది ఈమె.. రెడ్‌లైట్ ఏరియా గర్ల్‌గా అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్న ముంబయిలోని కామాటిపురాకు చెందిన శ్వేత కట్టి ప్రస్తుతం ఖండాతరాలు దాటింది. తన ధైర్యమే తనను నడిపిస్తున్నదని చెప్పింది. శ్వేత తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా అధిగమించిందో.. మెట్టుమెట్టు ఎలా ఎదిగిందో ఆమె మాటల్లోనే..
‘నా బాల్యమంతా ముంబైలోని కామాటిపురాలోనే సాగింది. 16 ఏండ్లు వచ్చేవరకు నేను అక్కడే పెరిగాను. నిజానికి నా బాల్యం, నా నేపథ్యం చాలా దుర్భరమైనది. మా తాత ఓ వ్యభిచార గృహాన్ని నడిపేవాడట. అయితే మా అమ్మమ్మ గర్భిణిగా ఉన్నప్పుడే అతడు చనిపోయాడు. నా తల్లి కూడా సెక్స్ వర్కరే. నా తండ్రిని ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. నాకు ఆరేళ్లు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అయితే మా అమ్మ మరో వ్యక్తితో సహజీవనం చేసింది. ప్రస్తుతం అతడి ఇంటిపేరే నాకు సంక్రమించింది. అతడు నా తల్లిని నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో నాకు మాత్రం చదువుకొని గొప్పగా బతకాలని చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ దానికి మార్గం మాత్రం తెలిసేది కాదు. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఓ ఆంటి ఉండేది. ఆమె కూడా సెక్స్ వర్కరే. అయితే ఆమె విద్యావంతురాలు. కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో ఆమె సెక్స్‌వర్కర్‌గా మారాల్సి వచ్చింది. అయితే నాకు చదువు పై శ్రద్ధ కలగడానికి కారణం ఆమె మాటలే. 2012లో నేను క్రాంతి అనే స్వచ్ఛంద సంస్థ నన్ను అక్కున చేర్చుకున్నది. ముంబైకి చెందిన ఎన్ఆర్ఐ రాబిన్ చౌరాసియా ఈ సంస్థను ప్రారంభించారు. ఆయనే నన్ను అమెరికా తీసుకెళ్లి చదివించారు.
ఒక్కోమెట్టు ఎదుగుతూ..
అనంతరం నేను ఒక్కోమెట్టూ ఎదుగుతూ 2013లో న్యూయార్క్‌లోని బార్డ్ కాలేజీలో సైకాలజీ ప్రధానంగా గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరాను. అక్కడ నాకు 30వేల డాలర్ల స్కాలర్‌షిప్ వచ్చేది. ఇండియా రెడ్‌లైట్ ఏరియా నుంచి వచ్చి అమెరికాలో విద్యనభసించిన మొదటి వ్యక్తిని నేనే అని వార్తాపత్రిక ద్వారా తెలుసుకున్నా. ప్రస్తుతం నా లక్ష్యం ఒక్కటే నా తల్లికి ఒక సౌకర్యవంతమైన జీవితం కల్పించడం’ అని చెప్పుకొచ్చింది శ్వేతా కట్టి.