Begin typing your search above and press return to search.

చరిత్రలో చూడని పెళ్లి ఇదీ..

By:  Tupaki Desk   |   8 March 2020 7:00 AM IST
చరిత్రలో చూడని పెళ్లి ఇదీ..
X
పెళ్లంటే సంప్రదాయం.. సంస్కృతి చెడిపోకుండా చూడడం.. మూడు ముళ్లు, ఏడు అడుగులు, కన్యాదానం.. ఇలా భారీ తంతు. అందులోనూ పెళ్లికొడుకు పైనా.. పెళ్లి కూతురు కింద.. అన్నీ తలవంచుకొని చేయాలి. తాళి కట్టించుకోవడం నుంచి ఏడడుగులు, కన్యాదానం వరకూ పురుషుడి కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవడం వరకూ అంతా పెళ్లి కొడుకుదే నడుస్తుంది.

గోవాలోని విశాలమైన రిసార్ట్ లో వధువు కమలా శ్రీపాద, వరుడు యాగ్నిక్ మన సంప్రదాయాన్ని పాటిస్తూనే పెళ్లి కొడుకు ఎక్కువ.. పెళ్లి కూతురు తక్కువ అనే నానుడిని పక్కన పెట్టి తనకు కాబోయే భార్యకు అమిత గౌరవం ఇచ్చాడు.

పండితులు చెప్పినా కూడా భార్యను ఏడడుగులు వేసేటప్పుడు వెనుకాల కాకుండా తనతోపాటు నడిపించాడు. కన్యాదానం లో వరుడి కాళ్లు కడగడాన్ని యాగ్నిక్ నిషేధించాడు. ఇక జీలకర్ర బెల్లం నుంచి అన్నింట్లోనూ వధువును సమానంగా తనతోపాటు తంతును జరిపించుకొని సమానత్వాన్ని చాటాడు.

భార్యభర్తలు జీవితం కష్టసుఖాలు పంచుకుంటారు. ఒకరికి ఒకరు అండగా నిలుస్తారు. మరి పెళ్లిలో ఎందుకు ఇలా భార్యను అన్నింట్లోనూ తక్కువ చూడాలనే ఇలా చేశామని వరుడు యాగ్నిక్ తెలిపాడు. గోవాలో జరిగిన ఈ సమానత్వపు పెళ్లి ప్రస్తుతం వైరల్ గా మారింది.