Begin typing your search above and press return to search.

బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టే యూనానీ వైద్యం.. ఇలా చేస్తే సరిపోతుందట

By:  Tupaki Desk   |   21 May 2021 6:30 AM GMT
బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టే యూనానీ వైద్యం.. ఇలా చేస్తే సరిపోతుందట
X
వణికిస్తున్న కరోనాకు బ్లాక్ ఫంగస్ తోడు కావటం తెలిసిందే. వాయు వేగంతో విస్తరించే దీని బారిన పెద్ద ఎత్తున పడుతున్నారు. దీని వైద్యం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వందలాది మంది ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మందుల కొరతతో పాటు..మౌలిక వసతుల లేమి కారణంగా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి అవసరమైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ.. ప్రాణాలు తీసే బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టే వైద్యం యూనానీలో ఉందని చెబుతున్నారు ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షణి.

యూనానీ వైద్యంలో బ్లాక్ ఫంగస్ ను అడ్డుకునే మందుల్ని గుర్తించినట్లు చెప్పిన ఆమె.. ప్రభుత్వం కూడా తాము సూచన చేస్తున్న మందుల్ని అనుమతించిందని చెప్పారు. మరో వారంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యునానీ దవాఖానాల నుంచి ఈ మందుల్ని ప్రజలకు అందించనన్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారు యూనానీలో తాము పేర్కొన్న మందుల్ని వాడితే సరిపోతుందని చెబుతున్నారు.

అల్క అజీబ్: ఈ మందును టీ.. కాఫీ.. డికాక్షన్.. పాలతో పాటు గోరు వెచ్చని నీటితో రెండు చుక్కలు కలుపుకొని తాగాలి. దీంతో ముక్కు రంధ్రాల్లో దాగిన వైరస్ నశిస్తుంది.

హబ్ - ఏ - ముస్పఫీ: ఈ క్యాప్సుల్ ను ఉదయం.. రాత్రి వేళలో ఆహారం తిన్న తర్వాత వేసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ది చేసి.. రక్తంలోని వైరస్ ను నిర్మూలిస్తుంది.

ఖమిరా అబ్రేహం: దీనిని రెండు రకాలుగా అందించాలి. షుగర్ పేషెంట్లకు పౌడర్ రూపంలో.. ఇతరులకు లేహ్యంగా ఇస్తారు. పొడి రూపంలో ఉన్న ఔషధాన్ని 500 మిల్లీ గ్రాముల చొప్పున ఉదయం రాత్రి వేళల్లో తీసుకోవాలి. తేనెతో చేసిన లేహ్యాన్ని షుగర్ లేని వారు ఐదు గ్రాముల చొప్పున ఉదయం.. సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి. వారం నుంచి పది రోజుల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే బ్లాక్ ఫంగస్ బారి నుంచి బయటపడే అవకాశం ఉందట.