Begin typing your search above and press return to search.

వైద్య చరిత్రలోనే మిరాకిల్.. 30 ఏళ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ!

By:  Tupaki Desk   |   31 March 2021 9:37 AM IST
వైద్య చరిత్రలోనే మిరాకిల్.. 30 ఏళ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ!
X
దేశ రాజధాని దిల్లీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పుట్టుకతోనే నోరు పూడుకుపోయిన ఓ మహిళ ముప్పై ఏళ్ల తర్వాత నోరు తెరిచింది. వైద్యుల విశ్వప్రయత్నాల అనంతరం ఆమె సమస్య పరిష్కారమైంది. కాగా దీనిని వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్ అని చెబుతున్నారు ఆ రంగ నిపుణులు.
ఇదీ సంగతి దిల్లీకి చెందిన ఆస్తా మోంగియాకు పుట్టుకతోనే నోరు పూడుకుపోయింది. ఆమె తనకున్న ప్రతిభతో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించారు. ఆ బ్యాంక్లో మేనేజర్గా పని చేస్తున్నారు. చిన్నప్పుటి నుంచి తన సమస్య కోసం చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఆమె దవడ ఎముక నోరు రెండు వైపుల నుంచి ముందుకు వెళ్లి పుర్రె ఎముకకు అతుక్కుపోయిందని అన్నారు. దాంతో చిన్నప్పటి నుంచి నోరు తెరవలేదని చెప్పారు. ముప్పై ఏళ్లుగా కేవలం ద్రవ పదార్థాలనే తీసుకుంటున్నట్లు వివరించారు.

ఓ మిరాకిల్
కొన్ని రోజుల క్రితం రాజధానిలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ మహిళ తెలిపారు. ఆ ఆస్పత్రిలో అనేక వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి పుట్టుకతో పూడిపోయిన ఆ మహిళ నోరు 30 ఏళ్ల తర్వాత తెరిచేలా చేశారు. ఈ సంఘటన వైద్య చరిత్రలోనే ఓ మిరాకిల్ను అని చెబుతున్నాయి ఆ ఆస్పత్రి వర్గాలు.

అవధులు లేని ఆనందం
తనకు నోరు తెరిచే అవకాశం ఉండదేమోనని... ఇక జీవితాంతం అలాగే ఉండాల్సి వస్తుందనుకున్నాననుకొని బాధితురాలు తెలిపారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సలు చేసి తనకు పునర్జన్మ ప్రసాదించిన ఆ వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ముప్పై ఏళ్ల తర్వాత నోరు విప్పిన ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయానని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.