Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై మీడియా సర్వేలు ఏం చెబుతున్నాయ్?

By:  Tupaki Desk   |   3 Nov 2020 11:50 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై మీడియా సర్వేలు ఏం చెబుతున్నాయ్?
X
మరికాసేపట్లో.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. యావత్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు ప్రపంచ రాజకీయాలపై ప్రభావాన్ని చూపటం ఖాయం. నోటిదురుసుతనం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించటంతో పాటు.. దూకుడు తీరుతో బోలెడంత అప్రదిష్టను మూటకట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భవితవ్యం కొన్ని గంటల్లో తీర్పు నిక్షిప్తం కానుంది. గడిచిన కొన్ని నెలలుగా సాగుతున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా గెలుపు ఎవరిది? అన్న అంశంపై బోలెడన్ని సర్వేలు.. జోస్యాలు బయటకు వచ్చాయి.

ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి కాస్త ముందుగా వివిధ మీడియా సంస్థలు ఎన్నికల ఫలితాల మీద ఏమంటున్నాయి? ఎలా స్పందిస్తున్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా సాగింది. ట్రంప్ నకు వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదని.. కరోనా మహమ్మారికి ఆయన గెలుపును అడ్డుకున్నట్లుగా సాగిన ప్రచారానికి వాస్తవానికి మధ్య అంతరం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. వీడియా సంస్థలు వెలువరిస్తున్న సర్వే ఫలితాలు ఏవీ కూడా ట్రంప్ కు తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లుగా చెప్పక పోవటమే.

ట్రంప్ తో పోలిస్తే..ఆయన ప్రత్యర్థి జోబైడెన్ కాస్త అధిక్యతలో ఉన్నట్లుగా చెప్పటం గమనార్హం సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన సర్వే రిపోర్టుల ఫలితాల్ని ఐదు శాతం ప్లస్ ఆర్ మైనస్ అన్నట్లుగా లెక్కిస్తారు. ఈ లెక్కన చూస్తే.. ట్రంప్ గెలుపును బైడెన్ కొల్లగొడుతున్నట్లుగా వివిధ మీడియా సంస్థలు చెబుతున్నారు. ఆ తేడా ఐదు శాతం తర్వాత చూస్తే.. చాలా తక్కువగా ఉందన్న విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు సీఎన్ఎన్ సర్వేనే చూస్తే.. బైడెన్ కు 54 శాతం గెలుపు అవకాశం ఉందని పేర్కొంటే.. ట్రంప్ కు 42 శాతం ఓట్లు లభిస్తాయని చెబుతున్నారు. ఇందాక చెప్పినట్లుగా.. ఐదు శాతం అటు ఇటు అన్నది లెక్క వేసినప్పుడు ట్రంప్ 47 శాతం పెరిగి.. బైడెన్ కు ఐదు శాతం తగ్గితే 49 శాతం అవుతుంది. అలాంటప్పుడు ఇద్దరి మధ్య ఉన్న తేడా కేవలం రెండు శాతమే. ఇదే తీరులో ప్రముఖ మీడియా సంస్థల సర్వే నివేదికలు ఉండటం గమనార్హం.

దీన్ని చూస్తే అర్థమయ్యేదేమంటే..తాజాగా జరుగుతున్న అధ్యక్షఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయే తప్పించి.. ఏకపక్షం ఎంతమాత్రంకాదన్నది మర్చిపోకూడదు. ఇక.. వివిధ మీడియా సంస్థుల అంచనాల్ని చూస్తే.. ఇలా ఉన్నాయి.

మీడియా సంస్థ        జో బైడెన్       ట్రంప్
న్యూయార్క్ టైమ్స్ / సియెన్నా 50         41
ఐపీఎస్ఓఎస్/ రాయిటర్స్     52          42
ఫాక్స్ న్యూస్           52         44
ఎన్ బీసీ/డబ్ల్యూఎస్ జే       52          42
సీఎన్ఎన్/ఎస్ఎస్ఆర్ఎస్     54          42